ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జపాన్ పర్యటనకు వెళ్లే ముందు, అఖిలేష్ యాదవ్ ఇద్దరు డిప్యూటీ సీఎంలను (కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్) ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
అఖిలేష్ ఇచ్చిన ఆఫర్: “100 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోగలిగితే ఎవరైనా యూపీ ముఖ్యమంత్రి కావచ్చు” అని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ఆయన నేరుగా పేర్లు ప్రస్తావించనప్పటికీ, బీజేపీలోని అసమ్మతిని రగిల్చేలా ఈ ఆఫర్ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
బీజేపీ ఎదురుదాడి: అఖిలేష్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. ఢిల్లీ బీజేపీ నేత ఆర్.పి. సింగ్ మాట్లాడుతూ.. అఖిలేష్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. “తన సొంత బలంతో ముఖ్యమంత్రి కాలేనని అఖిలేష్‌కు అర్థమైంది, అందుకే ఇలాంటి ‘ముంగేరీలాల్ కలలు’ కంటున్నారు” అని ఎద్దేవా చేశారు. యూపీ బీజేపీ ప్రతినిధి మనీష్ శుక్లా స్పందిస్తూ.. అఖిలేష్ రాజకీయ నిరాశలో ఉన్నారని, ప్రజలు ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు.
