100 మంది మహిళలతో గురూజీ కామపురాణ కేసులో ట్విస్ట్; మంత్రుల వైపు మళ్లుతున్న దర్యాప్తు!

నాసిక్ : జ్యోతిష్యుడినని చెప్పుకుంటూ భక్తులను వంచిస్తున్న నాసిక్ గురూజీ అశోక్ ఖారత్ అరెస్ట్ తర్వాత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్‌ఐటీ (SIT) పోలీసులు ఈ కేసు దర్యాప్తును తీవ్రతరం చేశారు. నిందితుడి ఫోన్ల నుండి సేకరించిన సీడీఆర్ (CDR – కాల్ డీటెయిల్ రికార్డ్) డేటా ఆధారంగా, ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు మరియు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతోంది.

రాసలీలల గురూజీ బండారం బయటపడిందిలా.. ఆధ్యాత్మికం, పూజల పేరుతో 100 మందికి పైగా మహిళలను లైంగికంగా వాడుకున్న అశోక్ ఖారత్ ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇతనికి సంబంధించిన పలు అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరెస్ట్ సమయంలో స్వాధీనం చేసుకున్న ఫోన్ల డేటా ఇప్పుడు దర్యాప్తు దిశను మార్చేసింది.

నేతలతో సంబంధాలు: సుమారు 150 మంది మహిళలను ఇతను వాడుకున్నాడని, పలువురికి గర్భస్రావం కోసం మాత్రలు కూడా ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతని ల్యాప్‌టాప్, మొబైల్ నుండి 200కు పైగా వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అశోక్ ఖారత్ నిరంతరంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, మంత్రి చంద్రకాంత్ పాటిల్, మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు రూపాలి చకాన్కర్ వంటి వారితో టచ్‌లో ఉన్నట్లు కాల్ డేటా ద్వారా వెల్లడైంది.

సామాజిక కార్యకర్త దమానియా చేసిన ఆరోపణల ప్రకారం.. రూపాలి చకాన్కర్‌తో గత ఏడాది ఈ గురూజీ ఏకంగా 177 సార్లు ఫోన్లో మాట్లాడాడు. అంటే సుమారు 9 గంటల 36 నిమిషాల పాటు వీరి సంభాషణ సాగింది. ఇక రూపాలి సోదరి ఏకంగా 326 సార్లు ఇతనికి కాల్ చేసినట్లు సీడీఆర్ రికార్డులు చెబుతున్నాయి.

మరోవైపు, ఏకనాథ్ షిండేతో కూడా అశోక్ ఖారత్ గత ఏడాది 17 సార్లు మాట్లాడారు. ఇందులో 7 సార్లు షిండే కాల్ చేయగా, 10 సార్లు గురూజీ కాల్ చేశారు. ఒక ఫోన్ కాల్ ఏకంగా 21 నిమిషాల పాటు సాగింది. మంత్రులు దీపక్ కేసర్కర్, సునీల్ తత్కరే, ఆశిష్ షెలార్ వంటి వారితో కూడా ఇతనికి నిరంతర సంబంధాలు ఉన్నట్లు దమానియా సంచలన ఆరోపణలు చేశారు.


Posted

in

by

Tags: