100 మందికి బదులు 200 మంది అతిథులు.. కోపంతో భోజనంలో విరేచనాల మందు కలిపిన వధువు తండ్రి! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

పాట్నా: సాధారణంగా వివాహ వేడుకల్లో అదనపు అతిథులు వస్తారని భావించి చాలా మంది ఆహారాన్ని ఎక్కువగానే సిద్ధం చేస్తారు. ఒకవేళ ఊహించని విధంగా అతిథులు ఎక్కువ మంది వస్తే పరిస్థితి ఏంటి? బీహార్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో, 100 మందికి బదులుగా 200 మంది అతిథులు రావడంతో వధువు తండ్రి తీసుకున్న నిర్ణయం అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టింది.

వరుడి తరపున కేవలం 100 మంది మాత్రమే వస్తారని వధువు కుటుంబం ఆశించింది. అందుకు తగ్గట్టుగానే భోజనం సిద్ధం చేశారు. కానీ, అనుకోకుండా 200 మంది అతిథులు రావడంతో వధువు తండ్రికి ఒళ్లు మండింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన, పెళ్లి భోజనంలో విరేచనాల మందును (Laxatives) కలిపి అతిథులకు వడ్డించాడు.

ఆ భోజనం చేసిన కాసేపటికే వరుడి తరపు బంధువులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో వారు వాటర్ బాటిళ్లు పట్టుకుని బహిరంగ ప్రదేశాలకు, పొలాల వైపు పరుగులు తీశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అతిథులందరూ టాయిలెట్ల కోసం అటు ఇటు పరుగులు పెట్టినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఊహించని విధంగా అతిథులు పెరిగితే ఎవరైనా ఒత్తిడికి లోనవుతారని కొందరు వధువు తండ్రికి మద్దతు తెలుపుతుండగా, మరేదైనా కారణంతోనైనా భోజనంలో విషపూరితమైన పదార్థాలు కలపడం అమానుషమని మరికొందరు విమర్శిస్తున్నారు.


Posted

in

by

Tags: