జీవితం ఎంత విచిత్రమైన రంగులు చూపుతుందో కదా! ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు, ఏ వయసులోనైనా ప్రేమ చిగురించవచ్చు.” ఇటువంటి ప్రేమకథలు విన్నప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం. అయితే, ఇలాంటి ఒక వింత ఘటన హర్యానాలోని సోనిపట్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా విద్యార్థులకు తమ టీచర్లపై క్రష్ ఉండటం మనం వింటుంటాం, కానీ ఇక్కడ కథ పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు తన వద్ద చదువుకునే 11వ తరగతి విద్యార్థితో కలిసి పరారవ్వడం చర్చనీయాంశమైంది.
ఏం జరిగింది? సోనిపట్‌కు చెందిన సదరు మహిళా ఉపాధ్యాయురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆమె వద్ద ఒక మైనర్ విద్యార్థి ట్యూషన్ కోసం వెళ్లేవాడు. ఈ క్రమంలో, ఉపాధ్యాయురాలు తన వద్ద చదువుకునే విద్యార్థి పట్ల ఆకర్షితురాలైంది. చివరకు ఎవరూ ఊహించని విధంగా, ఆమె ఆ మైనర్ విద్యార్థిని తీసుకుని పరారైంది. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టి, ఉపాధ్యాయురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ట్యూషన్ నుండి ప్రేమ వరకు.. ఆ మహిళ కేవలం విద్యార్థికి క్లాస్ టీచర్ మాత్రమే కాదు, ఇంట్లో ట్యూషన్లు కూడా చెప్పేది. మే 29న మధ్యాహ్నం 2 గంటలకు ట్యూషన్ కోసం వెళ్లిన అబ్బాయి, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ వింత ప్రేమకథలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో పనిచేసే ఆ ఉపాధ్యాయురాలు విడాకులు తీసుకున్న మహిళ. గత రెండేళ్లుగా ఆ విద్యార్థి ఆమె ఇంటికి ట్యూషన్ కోసం వెళ్తున్నాడు. లాక్డౌన్ సమయంలో స్కూళ్లు మూతపడినప్పుడు కూడా విద్యార్థి రోజుకు నాలుగు గంటల పాటు ఆమె వద్దే ట్యూషన్ తీసుకునేవాడు. వారు పరారైన సమయంలో తమతో పాటు ఎటువంటి విలువైన వస్తువులను తీసుకెళ్లలేదని, కేవలం ఉపాధ్యాయురాలు తన వేలికున్న ఉంగరాన్ని మాత్రమే తీసుకెళ్లిందని సమాచారం. ప్రస్తుతం పోలీసులు సదరు ఉపాధ్యాయురాలిని అరెస్టు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
