“12 గంటల నైట్ షిఫ్ట్.. 7 నెలలు నిద్ర లేదు.. ముఖంపై జ్యూస్ పోసిన కస్టమర్.. కెనడాలో బర్గర్లు చేసిన భారతీయ యువకుడికి ఎదురైన అవమానం.. 3 ఏళ్లలో మారిన జీవితం..!!”

భారతదేశంలో మంచి జీతంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి కెనడాకు వెళ్లిన ఒక యువకుడు, అక్కడ రాత్రి సమయంలో 12 గంటల పాటు బర్గర్ షాప్‌లో పనిచేస్తూ పడిన కష్టాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.

కమాల్ నందా అనే ఆ వ్యక్తి, 2023లో కెనడాకు వెళ్లినప్పుడు గంటకు 16 డాలర్ల వేతనానికి ఒక రెస్టారెంట్‌లో పనిలో చేరాడు. ఒకరోజు మద్యం మత్తులో వచ్చిన ఒక కస్టమర్, ఆర్డర్ ఆలస్యమైందనే కారణంతో అతడిపై కూల్ డ్రింక్/జ్యూస్ పోసి అవమానించాడు.

ఆ అవమానమే అతని జీవితాన్ని మలుపు తిప్పే క్షణంగా మారింది. “మనం ఈ అవమానాలు పడటానికి ఇక్కడికి రాలేదు” అని తనకు తాను శపథం చేసుకున్న అతను, బర్గర్ షాప్‌లో పనిచేస్తూనే విరామ సమయంలో తీవ్రంగా వేరే ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు.

ఆ తర్వాత లభించిన ఒక పార్ట్-టైమ్ ఫ్రీలాన్స్ ఉద్యోగాన్ని అంగీకరించి, పగటిపూట ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కొత్త ఉద్యోగం, రాత్రి వేళల్లో బర్గర్ షాప్‌లో పని చేస్తూ.. వరుసగా 7 నెలల పాటు నిద్ర లేకుండా కష్టపడి పనిచేశాడు.

అతని నిరంతర శ్రమతో నేడు కెనడాలో స్వంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి, విలాసవంతమైన జీవితాన్ని గడిపే స్థాయికి ఎదిగాడు. “కష్టకాలంలో ఉన్నవారు దైర్యంగా ఉండండి, నిరాశపడకుండా రోజుకు కనీసం 1 గంట అయినా మీ నైపుణ్యాలను (Skills) పెంపొందించుకోవడానికి కేటాయించండి; కాలం ఖచ్చితంగా మారుతుంది” అని అతను సలహా ఇచ్చాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *