“120 మంది పురుషులతో అసభ్యంగా.. ఇతడేనా భర్త?”.. లగ్జరీ ఫార్మ్‌హౌస్‌లో భార్యతో కోట్లాది రూపాయల వ్యభిచార వ్యాపారం చేసిన 61 ఏళ్ల వ్యక్తి.. బట్టబయలైన భీకర నేపథ్యం!

తన భార్యను బలవంతంగా 120 మందికి పైగా పురుషులతో లైంగిక వ్యభిచారంలోకి దించిన 61 ఏళ్ల క్రూరమైన భర్తకు.. స్వీడన్ దేశంలోని హెర్నోసాండ్ (Härnösand) జిల్లా కోర్టు 4 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ప్రపంచాన్ని వణికించిన ఈ ఘోర ఉదంతం అంతర్జాతీయ సామాజిక వర్గాలలో తీవ్ర కలకలాన్ని రేపింది.

అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. స్వీడన్‌లోని క్రామ్‌ఫోర్స్ (Kramfors) ప్రాంతంలో ఉన్న ఒక నిర్మానుష్య ఫార్మ్‌హౌస్‌లో 2022 నుండి సదరు వ్యక్తి ఈ భారీ అరాచకానికి తెరలేపాడు. తన భార్యను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకోవడానికి బాహ్య ప్రపంచంతో ఆమెకు ఉన్న సామాజిక సంబంధాలన్నింటినీ తెంచివేశాడు. అంతేకాకుండా ఆమెకు నిరంతరం మత్తు మాత్రలు ఇస్తూ.. ఇల్లంతా సిసిడివి కెమెరాలను అమర్చి అత్యంత క్రూరంగా నిఘా పెట్టాడు.

పెట్రోల్ పోసి తగలేస్తానని బెదిరింపులు..
“నేను చెప్పినట్లు వినకపోతే నిన్ను చంపేస్తాను, పెట్రోల్ పోసి తగలేస్తాను, నీ వేళ్లను నరికేస్తాను” అంటూ పశువుకన్నా ఘోరంగా బెదిరింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా, ఆమెను ఆన్‌లైన్ ద్వారా కూడా లైంగిక కార్యకలాపాల్లోకి దించి కోట్లాది రూపాయలు సంపాదించాడు.

సినిమా ఫక్కీలో తప్పించుకున్న బాధితురాలు..
చివరికి, అక్టోబర్ 2025లో ఆ మహిళ సిసిడివి నెట్‌వర్క్‌లోని కెమెరాల కంటికి చిక్కని ఒక రహస్య ప్రాంతాన్ని (Blind Spot) చాకచక్యంగా గుర్తించింది. అక్కడ నుండి అత్యవసర సహాయ కేంద్రానికి రహస్యంగా సమాచారం అందించి, ఆ నరకం నుండి ఎట్టకేలకు తప్పించుకోగలిగింది.

కోర్టు విచారణ సమయంలో.. తాను నిర్దోషినని, అంతా పరస్పర అంగీకారంతోనే జరిగిందని ఆ భర్త వాదించినప్పటికీ, న్యాయస్థానం ఆ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. తీవ్రమైన వేధింపులు, బలవంతపు వ్యభిచార నేరాల కింద అతడికి జైలు శిక్ష విధించడంతో పాటు, బాధితురాలికి 2,0,000 స్వీడిష్ క్రోనా (సుమారు 2 లక్షల క్రోనా) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

కస్టమర్లకు సైతం జైలు శిక్ష..
ఈ దారుణ వ్యవహారంలో భాగస్వామ్యులైన 29 మంది కస్టమర్లలో 28 మందిని కోర్టు దోషులుగా ప్రకటించింది. వారికి కూడా జైలు శిక్షతో పాటు ప్రొబేషన్శి క్షలను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఒక మహిళను సిసిడివి నిఘా నీడలో ఉంచి చిత్రహింసలు పెట్టిన భర్త క్రూరత్వం.. మరియు ఆ నరకూపం నుండి సినిమా స్టైల్‌లో ఆ మహిళ తప్పించుకున్న సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. “కెమెరాలు పెట్టి ఎంతగా భయపెట్టినా, ఆ మహిళ ప్రదర్శించిన ధైర్యం నిజంగా వేరే లెవెల్!” అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతుండటంతో ఈ వార్త ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *