టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతదేహం, దాదాపు 125 రోజుల తర్వాత ప్రజల సందర్శనార్థం బయటకు వచ్చింది. ఈ చారిత్రాత్మక సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మృతదేహం ఎలా భద్రంగా ఉంది? సాధారణంగా ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మరణించిన 24 గంటల్లోనే అంత్యక్రియలు నిర్వహించాలి. అయితే, యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఖమేనీ మృతదేహాన్ని 4 నెలలుగా పూడ్చిపెట్టలేదు. ఇది ఎలా సాధ్యమైందనే అనుమానాలకు కౌంటర్ టెర్రరిజం నిపుణుడు డాక్టర్ మహ్మద్ ఉమర్ సమాధానమిచ్చారు. “ఇది ఎలాంటి మంత్రం లేదా మమ్మీ చేసే పద్ధతి కాదు. ఇరాన్ యొక్క అడ్వాన్స్‌డ్ ఫొరెన్సిక్ టెక్నాలజీ మరియు ‘ఫ్రీజింగ్ కోల్డ్ స్టోరేజ్’ సాయంతో మృతదేహాన్ని పాడవకుండా భద్రపరిచారు. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో మృతదేహాన్ని భద్రపరచడానికి షియా చట్టాల్లో మినహాయింపులు ఉన్నాయి” అని ఆయన తెలిపారు.
ఇరాన్ చూపుతున్న శక్తి ప్రదర్శన: ఈ అంత్యక్రియలను ఇరాన్ ప్రభుత్వం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల ప్రజల మద్దతును తెలిపే ‘జనమత సేకరణ’గా (Referendum) చూపిస్తోంది. అమెరికా దాడులు జరిగినా ఇరాన్ విప్లవ స్ఫూర్తి తగ్గలేదని ప్రపంచానికి చాటిచెప్పాలని వారు భావిస్తున్నారు. జూలై 9న ఖమేనీ మృతదేహాన్ని ఆయన జన్మస్థలమైన మషాద్‌లోని ఇమామ్ రజా దర్గా వద్ద శాశ్వతంగా ఖననం చేయనున్నారు.

Leave a Reply