14 ఏళ్ల బాలుడితో వ్యవహారం.! 19 ఏళ్ల యువతి చేసిన దారుణం. వారి ఏకాంతాన్ని చూసిన 15 ఏళ్ల బాలుడికి జ్యూస్ ఇచ్చిన జంట. మూగవాడైన తండ్రికి చెప్పుకుని విలవిల. ప్రాణాలు విడిచిన బాలుడు..!

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పరిధిలోని చిన్నకోరుకొండ గ్రామంలో హృదయ విదారకమైన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, 14 ఏళ్ల బాలుడు గత నెల 20వ తేదీన ఏకాంతంగా ఉండటాన్ని 15 ఏళ్ల జిల్లేల రవి అనే బాలుడు అనుకోకుండా చూశాడు. దీంతో తమ మధ్య ఉన్న సంబంధం ఊరికి తెలిసిపోతుందనే భయంతో, ఆ జంట రవిని చంపాలని పథకం పన్నింది.

తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు, ఆ జంట కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి రవికి ఇచ్చింది. ఆ పానీయం తాగిన కొద్ది నిమిషాల్లోనే బాలుడు రవి నోట్లో పొక్కులు వచ్చి, చర్మంపై ఎలర్జీ రావడంతో విలవిలలాడాడు. దీంతో అనుమానం వచ్చిన రవి వారిని నిలదీయగా, కూల్‌డ్రింక్‌లో విషం కలిపినట్లు వారు అసలు నిజం చెప్పారు. ఇది విని షాకైన బాలుడు, వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి, మాటలు రాని దివ్యాంగుడైన తన తండ్రికి, బంధువులకు విషయం చెప్పాడు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవిని కుటుంబ సభ్యులు వెంటనే కాపాడి, మొదట ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి ఆ బాలుడు ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దారుణ ఘటనపై మృతి చెందిన బాలుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చిన 19 ఏళ్ల యువతి, 14 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తమ వ్యవహారాన్ని దాచిపెట్టేందుకు 15 ఏళ్ల బాలుడికి విషమిచ్చి చంపిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం, విషాదం రేపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *