అనుకోని ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయి, గత 23 సంవత్సరాలుగా చేతులు లేకుండా జీవిస్తున్న ఒక వ్యక్తికి వైద్యరంగం సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది.
వైద్యుల బృందం దాదాపు 15 గంటల పాటు నిర్విరామంగా శ్రమించి అత్యంత క్లిష్టమైన సర్జరీ (ద్విహస్త మార్పిడి శస్త్రచికిత్స) ద్వారా వేరొక దాత చేతులను ఇతనికి విజయవంతంగా అమర్చి అరుదైన రికార్డు సృష్టించింది.
23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ చేతులను పొంది సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ వార్త నెట్టింట వైరల్ అవుతూ అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. అసాధ్యమైన ఈ ఘనతను సుసాధ్యం చేసి చూపిన వైద్యులను ‘నడిచే దేవుళ్లు’ అంటూ నెటిజన్లు, ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Leave a Reply