16 ఏళ్లు, 24 మంది మహిళలు, మత్తుమందు ఇచ్చి మృగాడిలా అఘాయిత్యం: మూగ మహిళ ధైర్యంతో ముంబై నరరూప రాక్షసుడు అరెస్ట్!

ముంబై: ముంబైలోని కురార్ పోలీసులు ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. 16 ఏళ్ల క్రితం ఒక మూగ మహిళపై అత్యాచారం చేసిన కేసులో 51 ఏళ్ల నిందితుడు మహేష్ పవార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తర్వాత విచారణలో అతను ఒక ‘సీరియల్ రేపిస్ట్’ అని, ఇప్పటివరకు 24 మందికి పైగా మహిళలను వేధించినట్లు భయంకరమైన నిజాలు బయటపడ్డాయి.

కేసు వివరాలు: నిందితుడు మహేష్ పవార్‌పై ఇప్పటివరకు ఏడుగురు మహిళలు నేరుగా అత్యాచార ఫిర్యాదులు చేశారు. అయితే, కురార్ మరియు వాకోలా ప్రాంతాల్లో అతను లైంగికంగా వేధించిన మహిళల సంఖ్య 24 కంటే ఎక్కువ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు విరార్‌లో పట్టుబడగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

వెలుగులోకి వచ్చిందిలా: బాధిత మహిళ మూగ వ్యక్తి కావడంతో నిందితుడు 16 ఏళ్ల నుంచి ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారం చేస్తున్నాడు. ఇటీవల మరో మూగ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుసుకున్న బాధితురాలు, ఆమెపై కూడా ఇతనే దాడి చేసి ఉండవచ్చని అనుమానించింది. దీంతో ధైర్యం చేసి తన భర్తకు నిజం చెప్పింది. సామాజిక కార్యకర్తలు, సంజ్ఞా భాష (Sign Language) నిపుణుల సహాయంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

గతం: 2009లో బాధితురాలు మైనర్ (అల్పవయస్కురాలు). ముంబైలో ఒక స్నేహితురాలిని కలవడానికి వచ్చినప్పుడు, ఆ స్నేహితురాలు ఆమెను శాంతాక్రజ్ (వాకోలా) లోని నిందితుడి ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ బర్త్‌డే పార్టీ సాకుతో ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. బాధితురాలు స్పృహ కోల్పోగానే నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, వీడియోలు తీశాడు. ఆ వీడియోల ద్వారా 16 ఏళ్లుగా ఆమెను బెదిరిస్తూ వస్తున్నాడు.


Posted

in

by

Tags: