16 ఏళ్లే నిండాయి..! సముద్రంలో ప్రాణాలతో పోరాడుతున్న 10 ఏళ్ల బాలుడిని కాపాడేందుకు రాకాసి అలల్లోకి ధైర్యంగా దూకిన కుర్రాడు. గుండెలను పిండేసే వీడియో.!!!!

అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో ఉగ్రరూపం దాల్చిన సముద్రపు అలల్లో కొట్టుకుపోయిన 10 ఏళ్ల బాలుడిని, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి దూకి కాపాడిన 16 ఏళ్ల యువ లైఫ్‌గార్డ్ సాహసకృత్యం నెట్టింట అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఈ సాహసోపేతమైన రెస్క్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ షిప్‌రైట్ బీచ్‌లో గడిచిన శనివారం నాడు అలలు చాలా ఆక్రోశంగా ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడడు ఆడుకుంటున్న సుమారు 10 ఏళ్ల బాలుడు, రాకాసి అలల ధాటికి తట్టుకోలేక సముద్రంలోకి కొట్టుకుపోయాడు. తీరంలో నిలబడి ఉన్నవారి గుండె ఆగిపోయేలా ఆ బాలుడు నీళ్లలో కొట్టుమిట్టాడుతుండటం చూసిన అక్కడి 16 ఏళ్ల యువ లైఫ్‌గార్డ్, ఒక క్షణం కూడా ఆలోచించకుండా సముద్రంలోకి దూకాడు.

ఎగిసిపడుతున్న రాకాసి అలలను ఎదుర్కొని బాలుడి వద్దకు చేరుకున్న అతను, అసాధ్యమైన ధైర్యంతో అతడిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చాడు. అంతేకాకుండా, సరైన శిక్షణ లేకుండా ఈత రాని కొందరు ప్రజలు ఆ బాలుడిని కాపాడటానికి నీళ్లలోకి దిగడానికి ప్రయత్నించినప్పుడు, వారిని అడ్డుకుని పరిస్థితి తీవ్రతను తెలియజేసిన ఆ యువకుడి పరిపక్వత అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సంఘటనను స్కాట్ వండర్ డ్యూసన్ అనే వ్యక్తి తన కెమెరాలో చిత్రీకరించి విడుదల చేశారు.

ఈ ధైర్యసాహసాలతో కూడిన పనికిగాను ఆ యువ లైఫ్‌గార్డ్‌ను నెటిజన్లు ‘రియల్ హీరో’ అని కొనియాడుతున్నారు. అలాగే, అమెరికా ప్రముఖ వ్యక్తి ఎరిక్ ట్రంప్ సహా పలువురు ఈ వీడియోను షేర్ చేస్తూ, ఆ యువకుడి అద్భుతమైన ధైర్యానికి దేశ అత్యున్నత పురస్కారం అందించాలని ప్రశంసించారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఆ చిన్నారి ప్రాణాలను కాపాడిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతో భావోద్వేగాన్ని నింపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *