“17 ఏళ్ల వేట తర్వాత చిక్కిన సైకో కిల్లర్!” ఎనిమిది మంది మహిళలను చంపిన నరరూప రాక్షసుడికి వరుసగా యావజ్జీవ శిక్షలు.. జడ్జి సంచలన తీర్పు..!!”

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ లాంగ్ ఐలాండ్‌లో వరుస మహిళల హత్యలకు పాల్పడి సుదీర్ఘకాలం పాటు భయాందోళనలు రేకెత్తించిన మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్ రెక్స్ హ్యూమన్ (Rex Heuermann) కు సఫోల్క్ కౌంటీ కోర్టు వరుసగా యావజ్జీవ కారాగార శిక్షలు (కన్సెక్యుటివ్ లైఫ్ సెంటెన్సెస్) విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

గత 17 సంవత్సరాలుగా పోలీసుల కళ్ళుగప్పి, పలువురు మహిళలను కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా గొంతు నులిమి చంపిన ఈ భయంకరమైన నేరస్థుడు.. మొత్తం ఎనిమిది మంది మహిళలను తానే హత్య చేసినట్లు కోర్టులో అధికారికంగా ఒప్పుకున్నాడు.

పిజ్జా ముక్కలోని డీఎన్ఏ క్లూతో దొరికిన హంతకుడు:
ఇన్నేళ్లుగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా తప్పించుకు తిరిగిన ఈ సైకో కిల్లర్‌ను పట్టుకోవడానికి ఒక చిన్న పిజ్జా ముక్క సహాయపడింది. అతడు తిని రోడ్డుపై పారేసిన ఒక పిజ్జా ముక్క (Pizza crust) లోని లాలాజలం ఆధారంగా సేకరించిన డీఎన్ఏ (DNA) నమూనాలను, ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో మ్యాచ్ చేయడం ద్వారానే పోలీసులు ఎట్టకేలకు ఇతడిని గుర్తించి అరెస్ట్ చేయగలిగారు.

“నువ్వొక పిరికివాడివి” – జడ్జి తీవ్ర ఆగ్రహం:
కోర్టు విచారణ సమయంలో బాధిత కుటుంబ సభ్యులు తమ కడుపుకోతను, అనుభవించిన నరకాన్ని కోర్టు హాల్లో పంచుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆ సమయంలో న్యాయమూర్తి నిందితుడి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడిని సమాజానికి తెగులు లాంటి ఒక “పిరికివాడు” మరియు “అసహ్యకరమైన మృగం” అని కోర్టు సాక్షిగా తీవ్ర పదజాలంతో మందలించారు.

జైల్లోనూ వింత పోకడలు – ఎఫ్‌బీఐతో ఒప్పందం:
ప్రస్తుతం జైలులో హై-సెక్యూరిటీ ఒంటరి గదిలో (సాలిటరీ కన్ఫైన్‌మెంట్) శిక్ష అనుభవిస్తున్న హ్యూమన్.. అక్కడ కూడా క్రైమ్ థ్రిల్లర్ నవలలు చదవడం మరియు జైలులో ఉన్న ఇతర దేశాల సీరియల్ కిల్లర్లకు లేఖలు రాయడం ఒక వింత అలవాటుగా మార్చుకున్నాడు.

అయితే, తాజాగా కుదిరిన ఒక చట్టపరమైన ఒప్పందం ప్రకారం.. భవిష్యత్తులో అమెరికాలో ఇలాంటి ఘోరమైన సైకో కిల్లర్లను, క్రిమినల్స్ మైండ్ సెట్‌ను అధ్యయనం చేసి వారిని పట్టుకోవడంలో అమెరికా అగ్రగామి నిఘా సంస్థ ‘ఎఫ్‌బీఐ’ (FBI) దర్యాప్తు విభాగానికి వాడు సహాయం చేయడానికి అంగీకరించాడు. బాధిత కుటుంబాల కన్నీటి గాథలు, ఈ క్రూరడి అమానుష వన్సత్వ వైఖరి కేవలం అమెరికానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెలువడిన ఈ తీర్పు బాధితుల ఆత్మలకు ఓరకమైన న్యాయాన్ని చేకూర్చిందని అంతర్జాతీయ చట్ట నిపుణులు భావిస్తున్నారు.


Posted

in

by

Tags: