“ఓ మనుషులారా.. 17 ఏళ్లుగా ఉసేన్ బోల్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మీరెవరూ బద్దలు కొట్టలేకపోయారు కదా.. ఇప్పుడు మేము తయారుచేసిన ఈ రోబో ఎంత ఈజీగా పరిగెత్తి గెలిచిందో చూడండి!” అంటూ చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ (Honor) ప్రకటించింది. తాము అభివృద్ధి చేసిన ‘లైట్నింగ్’ (Lightning) అనే హ్యూమనాయిడ్ రోబో, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవుడైన ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల చారిత్రక రికార్డును తునాతునకలు చేసిందని సగర్వంగా వెల్లడించింది.
2009 బెర్లిన్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల దూరాన్ని 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే చైనా నిర్వహించిన తాజా పరీక్షల్లో, ‘లైట్నింగ్’ రోబో సెకనుకు 14.5 మీటర్ల వేగంతో దూసుకెళ్లి కేవలం 9.32 సెకన్లలోనే 100 మీటర్ల దూరాన్ని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇది మానవుల అధికారిక అథ్లెటిక్స్ ప్రపంచ రికార్డుగా పరిగణించబడనప్పటికీ.. రోబో పరుగు వేగాన్ని పెంచేందుకు దాని కాళ్లను 1.05 మీటర్ల పొడవుతో తీర్చిదిద్ది చైనా తీసుకొచ్చిన ఈ సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 1997లో ప్రఖ్యాత చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్‌ను ‘డీప్ బ్లూ’ సూపర్ కంప్యూటర్ ఓడించిన ఘటన కంటే కూడా పెద్దదైన ‘మనిషి వర్సెస్ యంత్రం’ పోటీగా దీనిని టెక్ ప్రపంచం చూస్తోంది.

Leave a Reply