17 కోట్ల ఎకరాల భూమిని కలిగి ఉన్న భారతదేశపు అత్యంత శక్తివంతమైన ప్రైవేట్ సంస్థ ఏదో తెలుసా? షాక్ అవ్వకండి…

ప్రపంచం ఆవిర్భవించినప్పటి నుండి భూమిని దక్కించుకోవడం అనేది మానవుల అతిపెద్ద లక్ష్యంగా ఉంది. ఎందుకంటే భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది అధికారానికి చిహ్నం. అందుకే ఇప్పటికీ వ్యక్తుల నుండి ప్రభుత్వాల వరకు భూమిని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.

భారతదేశం సుమారు 3.29 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో మూడు ప్రధాన సంస్థలు దేశంలోని అధిక భాగం భూమిని నియంత్రిస్తున్నాయి.

భారతదేశంలో అత్యధిక భూమిని కలిగి ఉన్న సంస్థ ఏది? భారతదేశంలో అత్యధిక భూమి భారత ప్రభుత్వం వద్ద ఉంది. రెండో అతిపెద్ద భూ యజమానిగా ‘భారత క్యాథలిక్ చర్చి’ (Catholic Church of India) నిలుస్తోంది. ఫిబ్రవరి 2021 నాటికి ప్రభుత్వ భూ సమాచార వ్యవస్థ (GLIS) ప్రకారం, భారత కేంద్ర ప్రభుత్వం వద్ద సుమారు 15,531 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. ఈ భూమి 116 ప్రభుత్వ రంగ సంస్థలు మరియు 51 కేంద్ర మంత్రిత్వ శాఖల మధ్య విభజించబడింది.

ప్రభుత్వ భూమి ఎంత పెద్దది? భారత ప్రభుత్వం వద్ద ఉన్న భూమి విస్తీర్ణం ఖతార్, జమైకా, లెబనాన్ వంటి అనేక దేశాల మొత్తం విస్తీర్ణం కంటే పెద్దది. మంత్రిత్వ శాఖలలో రైల్వే శాఖ అత్యధిక భూమిని కలిగి ఉండగా, ఆ తర్వాత రక్షణ శాఖ మరియు బొగ్గు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.

భారత క్యాథలిక్ చర్చి వద్ద ఉన్న భూమి: భారత క్యాథలిక్ చర్చి దేశవ్యాప్తంగా సుమారు 7 కోట్ల హెక్టార్లు (అంటే 17.29 కోట్ల ఎకరాలు) భూమిని కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ భూముల్లో చర్చిలు, కాలేజీలు, పాఠశాలలు సహా అనేక భవనాలు ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ. 1 లక్ష కోట్లకు పైగానే ఉంటుంది. 1947 కి ముందు, బ్రిటిష్ పాలనలో 1927 నాటి ఇండియన్ చర్చి చట్టం ప్రకారం చర్చి ఈ భూముల్లో అధిక భాగాన్ని పొందింది.

ఎవరు నిర్వహిస్తారు? ఈ అపారమైన భూభాగాన్ని క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ మార్గనిర్దేశంలో ‘క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా’ (CBCI) నిర్వహిస్తుంది. గోవా నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు ఈ భూమి విస్తరించి ఉంది. 2012 గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఆసుపత్రులు, నర్సింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మరియు పాఠశాలలు ఈ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.


Posted

in

by

Tags: