“17,000 అడుగుల ఎత్తులో విమానంపై పడిన పిడుగు..!” నుజ్జునుజ్జైన ముందు భాగం.. 110 మంది ప్రాణాలను కాపాడిన పైలట్ సమయస్ఫూర్తి.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు..!!

పాట్నా నుంచి లక్నో బయలుదేరిన ఇండిగో విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా బలమైన పిడుగుపాటుకు గురైంది.

దీంతో విమానం దెబ్బతినడంతో, లక్నోలోని చౌధరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

ఈ విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది కలిపి మొత్తం 110 మంది ప్రయాణిస్తున్నారు. సుమారు 17,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో లక్నో పరిసరాల్లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని పిడుగు బలంగా తాకింది. ఈ ధాటికి విమానం ముందు భాగమైన ‘నోస్ కోన్’ (Nose Area) తీవ్రంగా దెబ్బతింది.

పిడుగు తాకిన తీవ్రమైన ఒత్తిడిలోనూ పైలట్ అత్యంత సమయస్ఫూర్తితో, ధైర్యంతో వ్యవహరించి విమానాన్ని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. పైలట్ తీసుకున్న వేగవంతమైన నిర్ణయం వల్ల విమానంలో ఉన్న 110 మంది ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.

అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, వారిని తమ గమ్యస్థానాలకు పంపేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు. గతంలో జూన్ 20న కూడా అగర్తలా వెళ్తున్న ఇండిగో విమానంపై పిడుగు పడటంతో కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్ చేసిన ఘటన చోటుచేసుకుంది.

వాతావరణ మార్పుల వల్ల విమానాలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం ప్రయాణికుల్లో కొంత ఆందోళన కలిగించినప్పటికీ, పైలట్ అద్భుతమైన నైపుణ్యంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *