“19 ఏళ్లుగా చనిపోయిన అన్న వేషంలో జీవించిన తమ్ముడు..!” ఎంత పక్కా ప్లానింగ్.. కవల సోదరుడి గుర్తింపుతో పోలీసులనే బురిడీ కొట్టించిన ప్రబుద్ధుడు.. ప్రియురాలు ఇచ్చిన ట్విస్ట్..!!

చైనాలో దోపిడీ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ఒక వ్యక్తి, ప్రమాదంలో మరణించిన తన కవల సోదరుడి (అన్న) గుర్తింపును ఉపయోగించి సుమారు 19 ఏళ్ల పాటు పోలీసుల కళ్లుగప్పి జీవించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

గత 2002లో కిడ్నాప్, దోపిడీ ఘటనల్లో పాల్గొన్న ‘చెన్’ అనే వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తుండగా, అతను 2007లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు నమ్మబలికి ఆ కేసును మూసివేయించారు.

అయితే, కేసుల సాధారణ పునఃసమీక్ష సమయంలో అనుమానం వచ్చిన పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టగా.. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది చెన్ అన్న అని, అప్పటి నుంచి అన్న పేరుతో తమ్ముడు చెన్ జీవిస్తున్నాడని తేలింది.

కుటుంబ సభ్యులు ఈ నిజాన్ని దాచిపెట్టినప్పటికీ, చనిపోయిన అన్న మాజీ ప్రియురాలు ఇచ్చిన వాంగ్మూలం, పాత ఫోటోలలో ఉన్న తేడాల ఆధారంగా ఈ భారీ కుట్ర బట్టబయలైంది.

చివరగా.. దోపిడీ జరిగిన 24 ఏళ్ల తర్వాత, తన అన్న గుర్తింపుతో దర్జాగా జీవిస్తున్న చెన్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి జైలుకు పంపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *