కర్ణాటకలోని చన్నరాయపట్టణ అంబికా నగర్‌కు చెందిన సాగమ్మ – మంజెశెట్టి దంపతుల కుమార్తె రక్షిత (19).
మొదటి సంవత్సరం బీఏ (B.A.) చదువుతున్న ఈమె, అదే ప్రాంతంలోని ఒక బేకరీలో పనిచేస్తున్న నవీన్ అనే యువకుడిని గత ఏడాదిన్నరగా ప్రేమిస్తోంది. రక్షిత తల్లి సాగమ్మ కూడా అదే బేకరీలో పనిచేస్తుండటంతో, వీరి ప్రేమకు ఆమె కూడా పూర్తి సమ్మతం తెలిపింది.
ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతున్నప్పటికీ, గత కొద్దిరోజులుగా నవీన్ తన కుమార్తెను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని తల్లి సాగమ్మ ఆరోపించింది. ఇదిలా ఉండగా, రక్షిత తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో చన్నరాయపట్టణ పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply