“2 నిమిషాల థ్రిల్లర్. కాక్‌పిట్ తలుపు తెరిచి అరిచిన పైలట్. ప్రముఖ టీవీ షో చూసి విమానాన్ని నడిపిన ప్రయాణికుడు! ‘నేను అసలు నమ్మలేకపోతున్నా’.. నెతన్యాహు చెప్పింది విని షాకైన ట్రంప్.!”

దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి వెళ్తున్న ‘ఫ్లైదుబాయ్’ (Flydubai FZ1073) విమానం కాక్‌పిట్‌లో, కో-పైలట్ చేసిన కిరాతక దాడిలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి ప్రయాణికులను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచార్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “నిజమైన హీరో” అని కొనియాడారు.

వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్, ఈ ఘటన గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో వివరంగా మాట్లాడినట్లు తెలిపారు. “ఆ కో-పైలట్ ఒక ఉగ్రవాది లేదా మానసిక రోగి అయి ఉండొచ్చు. అతను కత్తితో పొడవడంతో కెప్టెన్ స్మిత్ తీవ్రంగా గాయపడి విషమ స్థితికి చేరుకున్నారు. కానీ, ఆ పరిస్థితిలో కూడా మనోధైర్యంతో కాక్‌పిట్ స్టీల్ డోర్ తెరిచి సహాయం కోసం అరిచారు. ఆయన చూపిన ఈ సమయస్ఫూర్తే ఆయనను నిజమైన హీరోగా నిలబెట్టింది” అని ట్రంప్ భావోద్వేగంగా చెప్పారు.

అంతేకాకుండా, నెతన్యాహు తనకు చెప్పిన ఈ ఘటనలోని ఆసక్తికరమైన నేపథ్యాన్ని కూడా ట్రంప్ వివరించారు: “కెప్టెన్ స్మిత్ తలుపు తెరవగానే, ముందు భాగంలో కూర్చున్న ఒక ఇజ్రాయెలీ ప్లంబర్ ఆ అరుపులు విని లోపలికి దూసుకెళ్లాడు. అప్పటికే విమానం అత్యంత వేగంగా తలకిందులుగా కిందకు పడిపోతోంది. ఆ ప్రయాణికుడు వెంటనే దాడి చేస్తున్న వ్యక్తిని వెనక్కి లాగి పడేసి, విమాన నియంత్రణ స్టిక్‌ను (Control stick) పట్టుకుని పైకి లాగి విమానాన్ని స్ట్రెయిట్ చేశాడు. ‘ఎయిర్ డిజాస్టర్స్’ (Air Disasters) అనే టీవీ ప్రోగ్రామ్‌ను క్రమం తప్పకుండా చూసిన అనుభవంతో అతను ఆ పరిస్థితిని చక్కదిద్దాడు. ఆ తర్వాత (ప్రయాణికుల్లో ఉన్న) ఇతర పైలట్లు వచ్చి కాక్‌పిట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నేను విన్న కథలలోకెల్లా ఇది అత్యంత నమ్మశక్యం కాని, అద్భుతమైన కథ!” అని ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అయితే, ఈ సమాచారం అంతా నెతన్యాహు తనతో పంచుకున్నదని, దీనిపై అధికారిక దర్యాప్తులు ఇంకా కొనసాగుతున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీలు కెప్టెన్ స్మిత్ మచార్‌ను ప్రశంసించగా.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన వీరత్వాన్ని, చాకచక్యాన్ని వైట్ హౌస్‌లో బహిరంగంగా ప్రశంసించడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

‘మే డే’ (Mayday) అనే టెలివిజన్ సిరీస్‌ను చూడటం వల్లే తాను విమానాన్ని నియంత్రించగలిగానని ఆ ప్రయాణికుడు (ప్లంబర్) చెప్పాడు. విమానం కాస్త అదుపులోకి రాగానే, విమానంలో ఉన్న విశ్రాంత (Retired) పైలట్లు వచ్చి కాక్‌పిట్ బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకున్నారని, ఇకపై తాము చూసుకుంటామని తనతో చెప్పారని ఆ ప్రయాణికుడు వివరించాడు.


Posted

in

by

Tags: