అది అర్ధరాత్రి 12:30 గంటల సమయం.. జనసంచారం లేని ఆ సమయంలో ఒక డెలివరీ బాయ్‌కు వచ్చిన ఆర్డర్ అతడిని నివ్వెరపోయేలా చేసింది. కేవలం 20 రూపాయల విలువైన ఒక మ్యాగీ ప్యాకెట్‌ను డెలివరీ చేయమని ఆ ఆర్డర్ వచ్చింది.
అయితే, అంతకంటే పెద్ద ఆశ్చర్యం ఏమిటంటే, ఆ మ్యాగీని డెలివరీ చేయడానికి ఆ మహిళ అంగీకరించిన ఛార్జీ అక్షరాలా 395 రూపాయలు! ఇది చూసి షాక్ అయిన డెలివరీ బాయ్, ఆ మహిళను నేరుగా కలిసినప్పుడు అనుమానంతో ఇలా అడిగాడు.. “మేడమ్.. నిజంగా లోపల మ్యాగీనే ఉందా? లేక ఏదైనా నిషేధిత వస్తువులు ఉన్నాయా?” అని ప్రశ్నించాడు.
దానికి ఆ మహిళ చాలా సామాన్యంగా సమాధానమిస్తూ.. “లేదు అన్నా.. లోపల మ్యాగీనే ఉంది. అవతలి వ్యక్తుల దగ్గర చాలా డబ్బు ఉంది, అందుకే ఇంత డెలివరీ ఛార్జ్ ఇస్తున్నారు” అని నవ్వుతూ చెప్పింది. “20 రూపాయల మ్యాగీకి 400 రూపాయల డెలివరీ ఛార్జీనా?” అని ఆ డెలివరీ బాయ్ నవ్వాలో ఏడవాలో తెలియక అయోమయానికి గురయ్యాడు. “ఒకవేళ రిసీవ్ చేసుకునేవారు ఫోన్ ఎత్తకపోతే పరిస్థితి ఏంటి? మీరే డబ్బులు కట్టేయండి” అని అతను చెప్పగా, ఆ మహిళ వెంటనే 400 రూపాయలను ఆన్‌లైన్‌లో చెల్లించింది. ఈ వింత అర్ధరాత్రి ఆర్డర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది.
