వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉండేదంటే.. అక్కడ ఒక పక్షి కూడా లోపలికి వెళ్లలేదు. 24 గంటల పాటు కాపలా ఉండే 2,000 మంది ఎలైట్ కమాండోలు, భయంకరమైన క్యూబన్ గూఢచారులు, ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే స్థలం మార్పు… ఇన్ని జాగ్రత్తలు ఉన్నప్పటికీ, అమెరికా సైన్యం అతడిని పడకగది నుంచే బంధించి తీసుకెళ్లిపోయింది.
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనదిగా భావించే కారకాస్‌లోని ‘మిరాఫ్లోర్స్ ప్యాలెస్’ లేదా ఆయన రహస్య బంకర్ నేడు నిర్మానుష్యంగా పడి ఉన్నాయి. గాలిని కూడా ఫిల్టర్ చేసి పంపేంతటి అత్యాధునిక భద్రత మధ్య ఉన్న మదురోను అమెరికా సైన్యం ఈగను తీసి పారేసినట్లు పట్టుకెళ్లిపోయింది. మదురో గర్వంగా చెప్పుకునే ‘ప్రెసిడెన్షియల్ గార్డ్’ ఏమైంది? అమెరికా దళాలు మదురోను పడకగది నుంచి ఈడ్చుకెళ్తున్నప్పుడు, అతడిని రక్షించడానికి ఒక్క తూటా కూడా ఎందుకు పేలలేదు?
మదురో భద్రతలోని 3 వలయాలు
మదురో తన ప్రాణాల గురించి ఎప్పుడూ భయపడేవాడు. అందుకే సాధారణ అధ్యక్షుడిలా కాకుండా ఒక భయపడే నియంతలా భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు.
- బాహ్య వలయం (Outer Ring): మైళ్ల దూరం వరకు ఎటువంటి కదలికలు లేకుండా మిలిటరీ పోలీసులు, నేషనల్ గార్డ్ పహారా కాసేవారు.
- మధ్య వలయం (Middle Ring): ఇక్కడ స్నిపర్లు, బాంబు నిర్వీర్య దళాలు మరియు యాంటీ-డ్రోన్ వ్యవస్థలు ఉండేవి.
- అంతర్గత వలయం (Inner Ring): ఇది మదురో వ్యక్తిగత వలయం. తన సొంత సైన్యం కంటే క్యూబన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లనే మదురో ఎక్కువగా నమ్మేవాడు.
నిరంతర భయం: ప్రతిరోజూ మారుతున్న పడకలు
అమెరికా నిఘా సంస్థల నుండి తప్పించుకోవడానికి మదురో విపరీతమైన మానసిక ఆందోళనతో (Paranoia) గడిపేవాడు.
- ఆయన వరుసగా రెండు రాత్రులు ఒకే మంచం మీద నిద్రపోయేవాడు కాదు. కారకాస్‌లోని వివిధ రహస్య గృహాలు, భూగర్భ బంకర్లలో తలదాచుకునేవాడు.
- ట్రాకింగ్ భయంతో స్మార్ట్ఫోన్లు వాడటం మానేశారు. కేవలం కమ్యూనికేషన్ కోసం డిస్పోజబుల్ (Burner phones) ఫోన్లు మాత్రమే వాడేవారు.
మరి అమెరికా పడకగది వరకు ఎలా చేరింది?
అంతటి భద్రత ఉన్నా మదురో తేరుకునే లోపే అమెరికా స్పెషల్ ఫోర్సెస్ దాడి చేశాయి. వ్యూహకర్తల ప్రకారం.. దీనికి ప్రధాన కారణాలు:
- ‘లోపల దాగున్న ద్రోహి’: 2,000 మంది కమాండోలు మౌనంగా ఉన్నారంటే, మదురో అత్యంత సన్నిహితులే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. అమెరికా దళాలు మదురోను తీసుకెళ్తున్నప్పుడు బయట ఉన్న గార్డులు నిశ్శబ్దంగా ఉండమని ఆదేశాలు అందుకుని ఉండవచ్చు.
- విఫలమైన క్యూబన్ కవచం: మదురో ఎక్కువగా నమ్మిన క్యూబన్ ఏజెంట్లు కూడా అతడిని కాపాడలేకపోయారు. వారు లొంగిపోవడమో లేదా నిర్వీర్యం చేయబడటమో జరిగింది.
- టెక్నాలజీ యుద్ధం: అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అమెరికా మదురో రాడార్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేసి, ఆయన ఖచ్చితమైన లొకేషన్‌ను కనుగొని ఉండవచ్చు.
ఆట ముగిసింది
ఆధునిక చరిత్రలో అత్యంత విజయవంతమైన మరియు దిగ్భ్రాంతికరమైన సైనిక చర్యలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. కమాండోలు, క్షిపణి వ్యవస్థలు, రాడార్లు ఏవీ మదురోను కాపాడలేకపోయాయి. తన భద్రతా గోడలే కూలిపోతే ఏ కోట అయినా పేకమేడలా కూలిపోతుందని ఈ ఘటన నిరూపించింది. ఎంతటి శక్తివంతుడైనా, సొంత ప్రజలు మరియు సైన్యం వెన్నుపోటు పొడిస్తే ఎవరూ కాపాడలేరనే బలమైన సందేశాన్ని ఈ ఘటన ప్రపంచ నియంతలకు పంపింది.
