వన్‌ప్లస్ (OnePlus) సంస్థ తన సరికొత్త ఏస్ 7 (Ace 7) సిరీస్ స్మార్ట్ఫోన్లను అక్టోబర్ 29న చైనాలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ సిరీస్‌లో OnePlus Ace 7, OnePlus Ace 7 Pro మోడళ్లు రానున్నాయి. లాంచ్‌కు ముందుగానే, ముఖ్యంగా ప్రో మోడల్ కెమెరాతో పాటు ఈ సిరీస్ డిస్ప్లే ఫీచర్లకు సంబంధించిన కొన్ని వివరాలను సంస్థ వెల్లడించింది.
OnePlus Ace 7 Pro స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. దీనికి అదనంగా 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉండనుంది. దీనిద్వారా దూరంగా ఉన్న వస్తువులు, భవనాలు, ప్రకృతి దృశ్యాలను అత్యంత స్పష్టంగా ఫోటోలు తీయవచ్చు. అంతేకాకుండా, ఈ సిరీస్‌లో 165Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేతో పాటు ఎంపిక చేసిన కొన్ని గేమ్స్‌లో 185Hz వరకు పనిచేసే సదుపాయం కూడా ఉన్నట్లు సమాచారం.
గేమింగ్ ఆడేటప్పుడు స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వేడెక్కకుండా నిరోధించడానికి, Ace 7 Pro మోడల్లో ఇన్‌బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, డ్యూయల్-ఛానల్ కూలింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు. అలాగే టచ్ రెస్పాన్స్, నెట్వర్క్ పనితీరు, డిస్ప్లే కోసం ప్రత్యేకంగా T3, G3, P4 అనే మూడు డెడికేటెడ్ చిప్స్ ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కువ సమయం గేమ్స్ ఆడేవారికి ఈ ఫీచర్లు ఎంతో ఉపయోగపడతాయి.
ఈ సిరీస్ మరో ప్రధాన ఆకర్షణ 9,000mAh బ్యాటరీ. అలాగే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. Ace 7 Pro మోడల్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Qualcomm Snapdragon 8 Elite Gen 5) ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. అంతేకాకుండా, 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. ఈ మోడళ్లు ఆండ్రాయిడ్ 17 (Android 17) ఆధారిత ColorOS 17 తో రావొచ్చు. అయితే, ఈ ఫోన్లు భారత్‌లో ఎప్పుడు విడుదలవుతాయి, ధర ఎంత ఉంటుంది అనే విషయాలపై సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
