“2023 నుంచి 2026 వరకు”.. కన్నకూతురిని కొన్నేళ్లుగా నాశనం చేసిన తండ్రి.. “మొదట అబార్షన్, ఆ తర్వాత డెలివరీ ఆపరేషన్”.. 16 ఏళ్ల బాలికకు పుట్టిన బిడ్డను అమ్మేసిన మేనత్త.. గుండెల్ని పిండేసే దారుణం..!!

మానవత్వం పూర్తిగా మంటగలిసిపోయిన ఒక కిరాతక ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వెలుగుచూసింది.

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురి పట్ల ప్రవర్తించిన తీరు యావత్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత 2023లో తల్లికి దూరమైన తన పెద్ద కుమార్తెను తండ్రి తన పూర్తి అదుపులోకి తెచ్చుకున్నాడు. భయపెట్టి, బెదిరించి ఆ బాలికపై నిరంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చగా, తన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ తండ్రి, బాలిక మేనత్త కలిసి చట్టవిరుద్ధంగా మందులు ఇచ్చి బలవంతంగా గర్భస్రావం (అబార్షన్) చేయించారు.

ఈ దారుణం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కూడా ఆ అరాచకం కొనసాగడంతో ఆ బాలిక మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆ తండ్రి కొందరు నర్సులు, మధ్యవర్తులతో కలిసి ఒక పక్కా క్రిమినల్ స్కెచ్ వేశాడు.

దాని ప్రకారం, బాలిక అసలు వయసును దాచిపెట్టి, నకిలీ పత్రాలు సృష్టించి ఆమెకు పెళ్లయిపోయిందంటూ ఒక కట్టుకథ అల్లారు. అనంతరం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మగబిడ్డను ప్రసవించేలా చేశారు. బిడ్డ పుట్టిన వెంటనే, ఆసుపత్రి సిబ్బంది సహాయంతో ఆ పసికందును వేరే వ్యక్తికి అమ్మి సొమ్ము చేసుకున్నారు.

ఈ చిత్రహింసలన్నింటినీ భరించలేకపోయిన ఆ బాలిక, ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన తల్లిని సంప్రదించి జరిగిన ఘోరాన్నంతా ఏడుస్తూ పూసగుచ్చినట్లు వివరించింది. ఇది విని విస్తుపోయిన తల్లి వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ఘాతుకానికి పాల్పడిన తండ్రి, మేనత్త, నకిలీ పత్రాలు సృష్టించడానికి సహకరించిన నర్సులు మరియు బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తి సహా మొత్తం 8 మందిని పోక్సో (POCSO) మరియు ఇతర సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కన్నతండ్రే రాక్షసుడిగా మారిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags: