“206 పేజీల వాట్సాప్ చాటింగ్..” టాయిలెట్ క్లీనర్ తాగించి దారుణ హత్య..? భర్త అక్రమ సంబంధం.. విచారణలో వెలుగుచూసిన సంచలన నిజాలు.!!

పంజాబ్‌లోని జలంధర్‌లో గల సెయింట్ సోల్జర్ కళాశాల లెక్చరర్ నేహా బాసి అనుమానాస్పద మృతి ఆ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.

నేహాకు ఆమె భర్త ఉమాంగ్ బాసి, అత్త కుసుమ్ బాసి కలిసి టాయిలెట్ క్లీనర్ (హార్పిక్) తాగించి అతి కిరాతకంగా హతమార్చారనే దిగ్భ్రాంతికర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టి, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతంలో తలదాచుకున్న నిందితులు ఉమాంగ్ బాసి, అతని తల్లి కుసుమ్ బాసిలను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఉమాంగ్ బాసితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సత్‌పాల్ కౌర్ అనే మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్‌పాల్ కౌర్ భర్త విశాల్ శర్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. “నా భార్యకు, ఉమాంగ్‌కు మధ్య ఉన్న అక్రమ సంబంధానికి సంబంధించి దాదాపు 206 పేజీల వాట్సాప్ చాటింగ్ ఆధారాలు లభించాయి. అందులో వీరిద్దరూ కలిసి తమ భాగస్వాములను అంతమొందించేందుకు పక్కాగా కుట్ర పన్నినట్లు స్పష్టమైంది” అని సంచలన ఆరోపణలు చేశారు.

మరోవైపు, ఈ హైప్రొఫైల్ కేసులో విచారణను నిర్లక్ష్యం చేసినందుకు గాను ఇన్‌స్పెక్టర్ బోధ్‌ రాజ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయగా, సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను బదిలీ చేశారు. ఈ దారుణ ఘటనపై పంజాబ్ పోలీసులు ప్రస్తుతం లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags: