“21 ఏళ్ల వయసులో సముద్రాన్నే గడగడలాడించిన యువకుడు.! 45 కి.మీ దూరాన్ని 10 గంటల్లో ఈదిన అద్భుతం. మాజీ ఒలింపిక్ క్రీడాకారుడి రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర.!!”

హాంకాంగ్ ద్వీపం చుట్టూ ఉన్న 45 కిలోమీటర్ల దూరాన్ని ఒంటరిగా ఈది 21 ఏళ్ల యువకుడు ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు.

హాంకాంగ్ మరియు ఫ్రెంచ్ సంతతికి చెందిన ఎమెరిక్ పేయర్ (Emeric Peyer) అనే ఈ యువకుడు, అత్యంత కఠినమైన సముద్రపు ఈత సవాలును విజయవంతంగా పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

గత నవంబర్ 2వ తేదీ వేకువజామున 4 గంటలకు హాంకాంగ్‌లోని చాయ్ వాన్ (Chai Wan) స్విమ్మింగ్ షెడ్ సమీపంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన అతడు, 45 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల 22 నిమిషాల 59 సెకన్లలో ఈదాడు. మధ్యాహ్నం 2.22 గంటలకు తన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నాడు.

అధికారికంగా ‘హెచ్.కె.360 స్విమ్’ (HK360 Swim) అని పిలిచే ఈ ఈవెంట్‌లో, గత 2025లో వారిస్ మిల్స్ నెలకొల్పిన 10 గంటల 35 నిమిషాల 58 సెకన్ల మునుపటి రికార్డును ఎమెరిక్ బద్దలు కొట్టాడు. దీని ద్వారా మాజీ ఒలింపిక్ క్రీడాకారుడు అలెక్స్ ఫాంగ్ (Alex Fong) నెలకొల్పిన రికార్డును సైతం అతను అధిగమించినట్లు సమాచారం.

ఈ కఠినమైన సముద్రపు ఈత సవాలును ఎలాంటి సహాయం లేకుండా ఒంటరిగా పూర్తి చేసిన 11వ వ్యక్తిగా ఘనత సాధించడంతో పాటు, ఈ ఫీట్ సాధించిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా ఎమెరిక్ రికార్డులకెక్కాడు. సముద్ర సంరక్షణ, జల పరిశోధనలకు నిధులు సేకరించే లక్ష్యంతోనే అతను ఈ రికార్డు ప్రయత్నం చేయడం విశేషం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *