“21 ఏళ్లకే రూ. 2.5 లక్షల జీతమా!”.. 3 నెలల అన్వేషణకు దక్కిన ప్రతిఫలం.. దుబాయ్ ఐటీ ఉద్యోగంపై తమిళ యువతి ఓపెన్ టాక్.. వైరలవుతున్న స్ఫూర్తిదాయక వీడియో..!!!

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన ఓ యువతి, దుబాయ్‌లో టెక్ సపోర్ట్ విభాగంలో పనిచేస్తూ నెలకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపింది.

తన 21వ ఏట దుబాయ్‌కు వెళ్లిన ఆమెకు, ప్రారంభంలో ఉద్యోగం సంపాదించడానికి దాదాపు 3 నుంచి 4 నెలల సమయం పట్టింది.

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చదివిన వారు ఇలాంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించింది. ప్రస్తుతం తాను పనిచేస్తున్న కంపెనీయే తనకు వసతి, వీసా సదుపాయాలను కల్పించిందని కూడా పేర్కొంది.

సొంత ఊరిని విడిచి దూరంగా ఉంటున్నప్పటికీ, వివిధ దేశాలకు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేయడం సరికొత్త అనుభూతిని ఇస్తోందని ఆమె పంచుకుంది. అయితే, కెరీర్ ప్రారంభంలోనే టెక్ సపోర్ట్ ఉద్యోగానికి ఇంత భారీ వేతనం ఇవ్వరని, ఇది అనుభవం ఉన్న వ్యక్తులకు ఇచ్చే ప్యాకేజీ అయ్యుండొచ్చని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.


Posted

in

by

Tags: