“23 ఏళ్ల యువకుడితో 21 ఏళ్ల యువతి ప్రేమాయణం”.. మెస్‌లో రహస్య భేటీ.. ప్లాస్టిక్ బస్తాలో శవమై తేలిన వైనం! బైక్‌పై మృతదేహాన్ని కట్టి తీసుకెళ్తుండగా పోలీసులకే వెన్నులో వణుకు పుట్టించిన దృశ్యం.. విస్తుపోయే నిజాలు!

పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదం కారణంగా 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రియురాలి గొంతు కోసి చంపిన అనంతరం, మృతదేహాన్ని ప్లాస్టిక్ బస్తాలో కట్టి బైక్‌పై తరలిస్తున్న నిందితుడిని పోలీసులు వాహన తనిఖీల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పురూలియా జిల్లా హురుమ్దా గ్రామానికి చెందిన అమిత్ కుమార్ మహతో (23) ఒక మెస్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని ప్రతికా మహతో (21), అమిత్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో వీరిద్దరూ ఒకే కోచింగ్ సెంటర్‌లో చదువుకున్నారు.

గత శనివారం ప్రతికా, అమిత్ ఉంటున్న మెస్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అమిత్, పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు ప్రణాళిక వేసి, ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి బస్తాలో కట్టి తన బైక్‌పై పెట్టుకున్నాడు. అర్ధరాత్రి వేళ పురూలియా – బాఘ్‌ముండి – బలరాంపూర్ రోడ్డు వైపు మృతదేహాన్ని పారవేయడానికి బయలుదేరాడు.

సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఆ మార్గంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటుగా బైక్‌పై వస్తున్న అమిత్‌ను అనుమానంతో ఆపి తనిఖీ చేయగా, ప్లాస్టిక్ బస్తాలో మృతదేహం ఉండటం చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న విభేదాలే హత్యకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

అరెస్టు చేసిన అమిత్ కుమార్‌ను న్యాయస్థానంలో హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అతనికి 9 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. హత్యకు ఉపయోగించిన ఆయుధం, మృతదేహాన్ని ఎక్కడ పారవేయాలనుకున్నాడు వంటి అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags: