మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ తన బ్యాంకింగ్ కెరీర్‌కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గత 23 ఏళ్లుగా బ్యాంకింగ్ రంగంలో చురుగ్గా పనిచేస్తున్న ఆమె, తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా (X ప్లాట్‌ఫామ్) స్వయంగా వెల్లడించారు.
23 ఏళ్ల క్రితం యాక్సిస్ బ్యాంక్‌లో ‘మేనేజ్‌మెంట్ ట్రైనీ’గా చేరిన అమృతా ఫడ్నవీస్, తన కష్టంతో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు అదే పదవికి ఆమె రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా తన సహోద్యోగులకు మరియు బ్యాంక్ ఎండీ & సీఈఓ అమితాబ్ చౌదరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు.
అమృతా ఫడ్నవీస్ తన పోస్ట్‌లో ఏమన్నారంటే:
“23 ఏళ్ల క్రితం ఒక యువ మేనేజ్‌మెంట్ ట్రైనీగా నేను యాక్సిస్ బ్యాంక్‌లో అడుగుపెట్టాను. ఈరోజు ఎంతో కృతజ్ఞతతో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా వీడ్కోలు పలుకుతున్నాను. బ్రాంచ్ కార్యకలాపాల నుండి కార్పొరేట్ బ్యాంకింగ్ వరకు, ట్రెజరీ నుండి కస్టమర్ రిలేషన్స్ వరకు నేను పొందిన అనుభవం ఈ సంస్థను నా కుటుంబంగా, గురువుగా మరియు రెండో ఇల్లుగా మార్చింది.”
“నా నాయకులకు, ముఖ్యంగా అమితాబ్ చౌదరికి నా ధన్యవాదాలు. ఈ అందమైన అధ్యాయం ముగుస్తున్న వేళ, జీవితకాల పాఠాలను మరియు స్నేహాలను నా వెంట తీసుకువెళ్తున్నాను. ధన్యవాదాలు యాక్సిస్ బ్యాంక్,” అని ఆమె పేర్కొన్నారు.
