“24 గంటలు లేట్.. లోకో పైలట్‌ను నిలదీసిన ఆంటీ.. ‘నువ్వే మాట్లాడు’ అంటూ వాకీ-టాకీ చేతికిచ్చిన పైలట్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!!”

రైలు 24 గంటలకు పైగా ఆలస్యంగా రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ, నేరుగా ఇంజిన్ వద్దకు వెళ్లి లోకో పైలట్‌ను నిలదీసి కడిగిపారేసిన ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సాధారణంగా రైలు ఆలస్యమైతే ప్రయాణికులు మౌనంగా భరిస్తారు లేదా విసుక్కుంటూ కూర్చుంటారు. కానీ ఈ ఆంటీ మాత్రం ఏకంగా రైలు ఇంజిన్ తలుపు తట్టి మరీ లోకో పైలట్‌ను బయటకు రప్పించి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది.

రైలు ఏకంగా 24 గంటలు ఆలస్యం కావడమే కాకుండా, స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా గంటల తరబడి అక్కడే నిలిపివేయడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు మహిళ కోపాన్ని చూసి ఒక్క నిమిషం ఏం చేయాలో పాలుపోని లోకో పైలట్.. రైలు ఆలస్యానికి తనకు ఎలాంటి సంబంధం లేదని అర్థమయ్యేలా, తన చేతిలో ఉన్న వాకీ-టాకీని ఆమె చేతికే ఇచ్చి “మీరే స్వయంగా అధికారులతో మాట్లాడండి” అని చెప్పారు.

ఆ వాకీ-టాకీని తీసుకున్న ఆంటీ ఎంతసేపు ‘హలో.. హలో’ అని పిలిచినా అవతలి వైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, ఆ దృశ్యాలను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో వీడియోను వైరల్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *