మనం తినే ఆహారం నుండి, కోసే చాపింగ్ బోర్డ్ వరకు.. మనకు తెలియకుండానే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్, మన రోజువారీ అలవాట్లు గుండె ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని 1 నుండి 10 స్కేలుపై వివరించారు.
- ప్రాసెస్ చేసిన మాంసం (రేటింగ్: 5/10): హాట్ డాగ్స్, ప్యాక్ చేసిన మాంసాల్లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి కోలన్ క్యాన్సర్ మరియు టైప్ 2 డయాబెటిస్ ముప్పును పెంచుతాయి.
- క్రమం తప్పకుండా గంజాయి (Marijuana) సేవించడం (రేటింగ్: 8/10): చాలా మంది ఇది ప్రకృతి సిద్ధమైనది కాబట్టి సురక్షితం అనుకుంటారు. కానీ, ఇది గుండె సంబంధిత వ్యాధుల ముప్పును పెంచుతుందని డాక్టర్ హెచ్చరించారు.
- మద్యపానం (రేటింగ్: 10/10): ఆల్కహాల్ శరీరంలోని ప్రతి కణంపై విషప్రభావాన్ని చూపుతుంది. సురక్షితమైన ఆల్కహాల్ మోతాదు అంటూ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
- ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు (రేటింగ్: 5/10): వీటిని వాడటం వల్ల ఏడాదికి సుమారు 50 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ను మనం తీసుకుంటున్నాము (అంటే 10 క్రెడిట్ కార్డుల బరువు). ఇవి హార్మోన్ల సమతుల్యతను, సంతానోత్పత్తిని దెబ్బతీస్తాయి. చెక్క బోర్డులు వాడటం మంచిది.
- ఒంటరితనం (రేటింగ్: 8/10): దీర్ఘకాలిక ఒంటరితనం ధూమపానం లేదా ఊబకాయం (Obesity) అంత ప్రమాదకరమని డాక్టర్ తెలిపారు. స్నేహితులతో కనెక్ట్ అవ్వడం గుండెకు చాలా అవసరం.
