25 ఏళ్ల యువకుడిపై మోజు.! పెళ్లి ఈడుకొచ్చిన కొడుకును పెట్టుకుని మహిళ తరచూ అక్రమ సంబంధం. కన్నతల్లిని ఆ స్థితిలో చూసి రగిలిపోయిన కొడుకు. అర్ధనగ్న స్థితిలో శవమై తేలిన భయానక ఘటన..!

కర్ణాటక రాష్ట్రం భాగల్‌కోట్ జిల్లా బీళగి సమీపంలోని కొండ ప్రాంతంలో కూలీ కార్మికుడు ఒకరు అర్ధనగ్న స్థితిలో హత్యకు గురై పడి ఉన్న కేసులో, తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు నిరసనగా కొడుకు తన స్నేహితుడితో కలిసి చేసిన దారుణ హత్యోదంతం ప్రస్తుతం పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కూలీ కార్మికుడైన ప్రకాష్ (26) అనే వ్యక్తి గతేడాది జూన్ 27వ తేదీన కొండ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో శవమై పడి ఉన్నాడు. దీనిపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

ఈ కేసులో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, శ్రీనివాస్ మరియు అతని స్నేహితుడు నదీమ్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఆ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి; అరెస్ట్ అయిన శ్రీనివాస్ తల్లి పసమ్మ (45) అనే మహిళతో హత్యకు గురైన ప్రకాష్‌కు అక్రమ సంబంధం ఉంది. వీరిద్దరూ తరచూ ఏకాంతంగా కలుసుకునే విషయం ఆ మహిళ కొడుకైన శ్రీనివాస్‌కు తెలియడంతో, తన తల్లితో తిరుగుతున్న ప్రకాష్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని శ్రీనివాస్ పథకం వేశాడు.

దాని ప్రకారం జూన్ 27న ప్రకాష్‌ను కొండ ప్రాంతానికి నమ్మించి తీసుకెళ్లిన శ్రీనివాస్, నదీమ్‌లు అతడితో కలిసి మద్యం సేవించారు. ప్రకాష్ బాగా మత్తులో జోగుతున్న సమయంలో, అతడిని అర్ధనగ్నంగా మార్చి తలపై పెద్ద బండరాయి వేసి దారుణంగా హత్య చేసి ఇద్దరూ అక్కడి నుంచి పరారైనట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరింత తీవ్రంగా విచారిస్తున్నారు.


Posted

in

by

Tags: