25 ఏళ్లకే మొదలవుతున్న సమస్య! స్త్రీ, పురుషులను వీడని మానసిక ఒత్తిడి; ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఇదే.. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ హెచ్చరిక!

భారతదేశంలో 25 ఏళ్ల లోపు యువత గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి (Stress) గురవుతున్నారని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (IPS) ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో జరిగిన 77వ జాతీయ సదస్సులో సమర్పించిన నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు: మానసిక సమస్యలు కేవలం వయసు మళ్లిన వారికే వస్తాయనే అపోహను ఈ నివేదిక పటాపంచలు చేసింది.

  • 34.6 శాతం సమస్యలు 14 ఏళ్ల వయసు కంటే ముందే మొదలవుతున్నాయి.
  • 48.4 శాతం 18 ఏళ్ల లోపు, 62.5 శాతం 25 ఏళ్ల లోపు ప్రారంభమవుతున్నాయి.
  • 2011 నుండి 2021 మధ్య కాలంలో, 18-25 ఏళ్ల యువతలో మానసిక వేదన 101.7 శాతం పెరిగింది.

కారణాలు: చదువు, ఉద్యోగ ఒత్తిడి, సామాజిక దూరం, మాదకద్రవ్యాల అలవాటు మరియు సెల్‌ఫోన్ల అతిగా వాడటం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి వల్ల మహిళల్లో శారీరక రుగ్మతలు, పురుషుల్లో రక్తపోటు (BP), గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. 15-29 ఏళ్ల యువతలో ఆత్మహత్యలకు మానసిక సమస్యలే మూడవ అతిపెద్ద కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.


Posted

in

by

Tags: