మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లో, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వ్యాపారవేత్తతో పరిచయం పెంచుకుని, కేసు పెడతానని బెదిరించి డబ్బు గుంజడానికి ప్రయత్నించిన పూజా రాయ్దాస్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
గ్వారీఘాట్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త సార్థక్ సింగ్కు తానొక విద్యార్థిని అని పరిచయం చేసుకుని ఇన్స్టాగ్రామ్లో స్నేహం చేసిన ఆ మహిళ, ఆ తర్వాత అతనితో సన్నిహిత సంబంధం ఏర్పరుచుకుంది. ఆ తర్వాత, వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తూ రూ.10 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసింది.
వ్యాపారవేత్త బతిమిలాడటంతో, రూ.2.5 లక్షలు తీసుకునేందుకు ఆమె అంగీకరించింది. అయితే బాధితుడు వెంటనే కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పన్నిన వలలో చిక్కుకున్న పూజా రాయ్దాస్, డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఆమె నుంచి రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమెపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply