అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న వింటర్ పార్క్ (Winter Park) ప్రాంతంలో, నెవాడా (Nevada) అనే 3 ఏళ్ల బాలుడు తన అసాధారణ ఫుట్బాల్ నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
5 ఏళ్ల పిల్లల ఫుట్బాల్ పోటీలో పాల్గొన్న ఈ బాలుడు ఒంటరిగా 10 గోల్స్ చేసి అదరగొట్టాడు. ఈ విషయాన్ని బాలుడి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ (Live Stream) చేస్తుండగా, ప్రత్యర్థి తరఫు తల్లిదండ్రులు ఈ బాలుడి ఆటతీరును చూసి షాక్ అవ్వడమే కాకుండా అసూయ పడ్డారు.
బాలుడు నెవాడా బంతిని తన నియంత్రణలోనే ఉంచుకుని, ఇతర పిల్లలు తీసుకోవడానికి వీలు లేని విధంగా చాలా అద్భుతంగా ఆడటం ప్రత్యర్థి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. దీంతో ఆగ్రహం చెందిన వారు, మైదానంలో నుంచే వెంటనే పోలీసులకు సమాచారం అందించి రప్పించారు. 3 ఏళ్ల బాలుడు అద్భుతంగా ఆడుతున్నాడనే కారణంతో పోలీసులను రప్పించిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, బాలుడు నెవాడా మరియు అతని కుటుంబ సభ్యులను మైదానం నుండి వెళ్ళిపోవాలని హెచ్చరించి (Trespass Notice) బయటకు పంపించారు. అంతేకాకుండా, ఆ బాలుడిని లీగ్ నుంచే తొలగించి, వారు చెల్లించిన ఫీజును కూడా నిర్వాహకులు తిరిగి ఇచ్చేశారు. 3 ఏళ్ల చిన్నారి ప్రతిభను ప్రశంసించాల్సింది పోయి, అతనిని శిక్షకు గురిచేసిన ఈ ఘటన క్రీడా అభిమానులలో, సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

Leave a Reply