“3 ఏళ్లుగా ఫ్రిజ్‌లో మృతదేహం”. ప్రాణ స్నేహితురాలిని చంపి పెంపుడు జంతువులతో పాటు ఫ్రిజ్‌లో పెట్టిన 65 ఏళ్ల సైకో. నొప్పిని తగ్గిస్తానంటూ సుత్తితో కొట్టి.. మహా దారుణం..!

బ్రిటన్‌లో తన ప్రాణ స్నేహితురాలిని దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని మూడేళ్లుగా ఫ్రిజ్‌లో దాచిపెట్టిన ఘటనకు సంబంధించిన కేసు విచారణకు రాగా, కోర్టులో వెల్లడైన విషయాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

65 ఏళ్ల జార్జ్ గోర్డాన్ అనే వ్యక్తి, తన ‘సోల్ మేట్’ (ఆత్మ బంధువు)గా భావించే 62 ఏళ్ల కళాకారిణి డెలియా మెక్‌ఇన్నెర్నీని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.

న్యాయవాది సమాచారం ప్రకారం, 2023 ఏప్రిల్‌లో డెలియా తన 5 పెంపుడు జంతువులైన ‘గినియా పిగ్స్’తో కలిసి పోర్చుగల్ వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రణాళిక వేసుకుంది. ఏప్రిల్ 11న, గోర్డాన్ ఆ జంతువులతో ఆమె ఉన్న చివరి వీడియోను తీయగా, అదే రోజు లేదా మరుసటి రోజు తెల్లవారుజామున ఆమె దారుణంగా హత్యకు గురైంది.

హత్య తర్వాత, అమెజాన్ ద్వారా ఒక పెద్ద ఫ్రీజర్‌ను ఆర్డర్ చేసి తెప్పించిన గోర్డాన్, డెలియా మృతదేహాన్ని అందులో దాచాడు. అంతేకాకుండా, ఆమె 5 పెంపుడు జంతువులను కూడా నీటిలో ముంచి చంపి, అదే ఫ్రీజర్‌లో పెట్టాడు. గత 3 ఏళ్లుగా డెలియా బతికే ఉన్నట్లు ఆమె స్నేహితులకు మెసేజ్‌లు, ఈమెయిళ్లు పంపుతూ వచ్చిన గోర్డాన్, ఆమె బ్యాంకు ఖాతా నుంచి వేలాది పౌండ్లను డ్రా చేయడంతో పాటు, ఆమె పేరు మీద అప్పులు కూడా చేశాడు.

2026 జనవరి 8న పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు, “ఆమె లోపల ఫ్రిజ్‌లో ఉంది” అని గోర్డాన్ స్వయంగా చెప్పాడు. ఫ్రిజ్ తెరిచి చూసిన అధికారులకు డెలియా మృతదేహంతో పాటు జంతువుల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. హత్య చేసినట్లు అంగీకరించిన గోర్డాన్, ఆత్మరక్షణ కోసమే తాను ఈ పని చేశానని, డెలియా మోతాదుకు మించి మందులు తీసుకోవడం వల్ల ఆమె నొప్పిని తగ్గించేందుకే సుత్తితో కొట్టానని చెప్పాడు. ఈ దారుణమైన కేసు విచారణ 6 వారాల పాటు జరగనుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *