“3 సార్లు స్వర్ణం సాధించిన ఛాంపియన్‌కు విషాదం..!” నీరజ్ యాదవ్ మృతి కేసులోకి మిస్టరీ ఉమెన్ ఎంట్రీ.. మెట్రో స్టేషన్ వద్ద షాకింగ్ ట్విస్ట్… స్కార్పియో కారులో అసలేం జరిగింది..??

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు మూడుసార్లు బంగారు పతకాలు అందించిన ప్రముఖ క్రీడాకారుడు నీరజ్ యాదవ్ ఆత్మహత్య కేసులో తాజాగా ఓ మహిళ ఎంట్రీ, స్కార్పియో కారుకు సంబంధించిన సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఏడేళ్ల వయసులోనే పోలియో బారిన పడినప్పటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో వీల్‌చైర్ టెన్నిస్, పారా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని.. షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో భారత్‌కు ఏకంగా 3 స్వర్ణ పతకాలను అందించాడు నీరజ్ యాదవ్.

ఇటీవల ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో, తన మరణానికి కొన్ని గంటల ముందు సోనిపట్ ప్రాంతంలో ఓ మహిళతో కలిసి అతను కారులో ఉన్నట్లు తాజాగా బయటపడింది.

ఇకపై నీతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేనని నీరజ్‌తో చెప్పిన ఆ మహిళ.. మౌజ్‌పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కారు దిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అనుమానంతో ఆమె తిరిగి వచ్చి చూడగా, నీరజ్ కారు దగ్గరే అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

వెంటనే ఆ మహిళ అతనిని జీటీబీ (GTB) ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. క్రీడా ప్రపంచంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: