30 మంది యువకులు.. ఒక్క యువతి.. పగలు బహిరంగంగా పొలంలోకి దూరి దారుణం! బైక్‌పై బలవంతంగా ఎక్కించుకుని.. వైరల్ అవుతున్న వీడియో!

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌పూర్ ప్రాంతంలో 30 మందికి పైగా యువకుల ముఠా, పొలంలో పనిచేసుకుంటున్న ఒక యువతిని బలవంతంగా లాక్కెళ్లి, మోటార్ సైకిల్ మీద అపహరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

గుండెలను పిండేసే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వీడియోలో 25 మందికి పైగా యువకులు రోడ్డు పక్కన నిలబడి గందరగోళం సృష్టించడం, కొందరు పొలంలోకి దూరి ఆ యువతిని బలవంతంగా ఈడ్చుకొచ్చి, బైక్‌పై ఎక్కించుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళల భద్రత మరియు చట్టంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, ఈ ఘటన వెనుక గిరిజన సమాజానికి చెందిన ఒక వింత ఆచారం ఉందని తెలుస్తోంది.

అసలేం జరిగింది? అపహరణకు గురైన యువతికి కొద్ది కాలం క్రితం నిహాలి గ్రామానికి చెందిన హుకుమ్ రావత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. గిరిజన ఆచారాల ప్రకారం ‘బేజా’ (Beja) అనే పద్ధతిలో భాగంగా, వరుడు వధువు కుటుంబానికి రూ. 2 లక్షలు చెల్లించాడు. అయితే, డబ్బు తీసుకున్నప్పటికీ వధువు కుటుంబ సభ్యులు ఆమెను అత్తారింటికి పంపలేదని సమాచారం.

దీంతో ఆగ్రహం చెందిన భర్త హుకుమ్ రావత్, తన భార్యను తీసుకెళ్లడానికి 25 నుండి 30 మంది స్నేహితులను కూడగట్టుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

పోలీసుల స్పందన: జూలై 7న జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు ఇరువర్గాల నుండి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయినప్పటికీ, వైరల్ వీడియోను ఆధారంగా చేసుకుని విచారణ చేపడుతున్నట్లు రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. గిరిజన సమాజంలో వివాహాన్ని ఖాయం చేసుకోవడానికి ఈ ధన మార్పిడి ఆచారం సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, చట్టపరంగా ఇది నేరమని, బలవంతపు అపహరణ (Forced kidnapping) నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


Posted

in

by

Tags: