“30 ఏళ్లకే ఉద్యోగం వదిలేసి రిటైర్మెంట్.! ఇక కష్టపడాల్సిన అవసరం లేదు. ఏడాదికి రూ.29 లక్షల ఆదాయాన్నిచ్చే 14 ఇళ్లు.! చైనా యువకుడి అద్భుతమైన పెట్టుబడి ప్రణాళిక.!!”

ప్రణాళికాబద్ధమైన పెట్టుబడి, కఠోర శ్రమ ఉంటే చిన్న వయసులోనే ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ పొందవచ్చని చైనాకు చెందిన 30 ఏళ్ల యువకుడు నిరూపించాడు.

రోజుకు 18 గంటల పాటు కష్టపడి డబ్బు ఆదా చేసిన అతను, ఆ డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టి ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ.29 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌కు చెందిన పాన్ జుంజి అనే యువకుడు ఉద్యోగం కోసం హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరానికి వెళ్లాడు. అక్కడ ఆన్‌లైన్ మెడికల్ రంగంలో పనిచేసిన అతను, ఎక్కువ సమయం కష్టపడి గణనీయమైన మొత్తాన్ని ఆదా చేశాడు. విలాసవంతమైన, ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసే బదులు, నగర నడిబొడ్డున ఉన్న పాత, చిన్న ఇళ్లను తక్కువ ధరకు కొనాలని నిర్ణయించుకున్నాడు.

అందులో భాగంగా, 2023 నుంచి రెండేళ్ల వ్యవధిలో మొత్తం 14 పాత ఇళ్లను కొనుగోలు చేశాడు. వాటి పునరుద్ధరణ (రెనొవేషన్) ఖర్చులతో కలుపుకుని 20 లక్షల యువాన్లకు పైగా.. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.8 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ 14 ఇళ్లలో 11 ఇళ్లను అద్దెకు ఇచ్చాడు. దీని ద్వారా అతనికి ఏడాదికి 2.10 లక్షల యువాన్లు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.29.4 లక్షల అద్దె ఆదాయం వస్తోంది.

ఈ స్థిరమైన ఆదాయం వస్తుండటంతో తన 30వ ఏటనే ఉద్యోగాన్ని వదిలేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే, ఇళ్ల నిర్వహణ, అద్దెదారులతో వ్యవహరించడంలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా ఇకపై పాత ఇళ్లను కొనుగోలు చేయబోనని అక్టోబర్ 26న ప్రకటించాడు. దానికి బదులుగా, డివిడెండ్ ఇచ్చే షేర్లు (స్టాక్స్), ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌లో డబ్బును పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తున్నాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *