32 ఏళ్లకే ఒక దిగ్గజాన్ని కుంగదీసిన ‘మరణ దెబ్బ’! బ్రూస్ లీ వింత మరణానికి అసలు కారణం ఇదే!

ప్రపంచంలో బ్రూస్ లీ పేరు తెలియని వారు ఉండరు. మార్షల్ ఆర్ట్స్ మరియు కరాటేలో శిఖర సమానమైన వ్యక్తి. ఆయన నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. అయితే, ఆయన సాధించిన విజయాలు ఎక్కువ కాలం కొనసాగలేదు. చిన్న వయసులోనే ఆయన మరణించడం ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలకు దారితీసింది. ఆయనకు ఆహారంలో విషం కలిపారని, శత్రువులే ఈ కరాటే పులిని చంపేశారని అందరూ నమ్మారు.

కానీ, కొన్నేళ్ల క్రితం అమెరికా పరిశోధనా సంస్థ బ్రూస్ లీ పోస్ట్‌మార్టం నివేదికను విశ్లేషించి ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని బయటపెట్టింది. బ్రూస్ లీ విషం వల్ల చనిపోలేదు. ఆయన మరణానికి అసలు కారణం అతిగా నీరు తాగడం.

వివరాల్లోకి వెళ్తే: బ్రూస్ లీ తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని భావించి రోజూ విపరీతంగా నీళ్లు తాగేవారు. ఒక లీటరో, రెండు లీటర్లో కాదు.. ఏకంగా 10 నుండి 12 లీటర్ల నీరు తాగేవారు. అతిగా నీరు తాగడం వల్ల (Excessive water consumption) శరీరంలో ‘సోడియం’ స్థాయిలు పడిపోయి, ఆయన మెదడు వాపునకు (Cerebral Edema) గురైంది. ఇదే ఆయన మరణానికి ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. కిడ్నీల వైఫల్యం కూడా దీనికి తోడైంది.

“అతి సర్వత్ర వర్జయేత్” (ఏదైనా మితిమీరితే అమృతం కూడా విషమే) అనే సామెత బ్రూస్ లీకి తెలిసి ఉంటే బహుశా ఆయన ఈ తప్పు చేసేవారు కారు. నీరు శరీరానికి అవసరమే కానీ, అది కూడా పరిమితికి లోబడి ఉండాలి. బ్రూస్ లీ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.


Posted

in

by

Tags: