రైలులోని థర్డ్ ఏసీ (3AC) బోగీలో ప్రయాణిస్తున్న ఒక కుటుంబం, మిడిల్ బెర్త్‌ను వంట బల్లగా మార్చేసి శాండ్విచ్లు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తూ తీవ్ర చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఓ గుజరాతీ కుటుంబం రైలులోని మిడిల్ బెర్త్‌పై పేపర్ పరిచి, బ్రెడ్, కూరగాయలతో శాండ్విచ్లు తయారు చేయడం రికార్డైంది.
అంతేకాకుండా, ‘దీనికోసం మనం ఎలక్ట్రిక్ శాండ్విచ్ టోస్టర్‌ను కూడా తెచ్చుకుంటే బాగుండేది కదా’ అని ఒక మహిళ నవ్వుతూ అనడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.
రైల్లో ఇలాంటి పనులు చేయడం సరైనదేనా, దీనివల్ల ఇతరులకు ఇబ్బంది కలగదా అని ఒక వర్గం ప్రశ్నిస్తుండగా.. తోటి ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలిగించనంత వరకు వాళ్లకి నచ్చిన ఆహారం వాళ్లు చేసుకోవడంలో తప్పేముంది అని మరికొందరు వాదిస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సురక్షితమేనా, ఇతరుల సౌకర్యానికి ఇది భంగం కలిగిస్తుందా అనే కోణంలో ప్రస్తుతం ఇంటర్నెట్లో నెటిజన్ల మధ్య అనుకూల, ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి.

Leave a Reply