భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు రింకూ సింగ్ కుటుంబ సభ్యులను గత కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఘటనకు సంబంధించి, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సంతోషకరమైన వార్త వెలువడింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్‌లోని రింకూ సింగ్ ఇంట్లో పెంచుకుంటున్న ‘బ్రూటో’ అనే గోల్డెన్ లాబ్రాడార్ జాతికి చెందిన కుక్క, గత అక్టోబర్ 12వ తేదీన ఎప్పటిలాగే బయటకు వెళ్లిన క్రమంలో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది.
కుక్క ఇంటికి తిరిగి రాకపోవడంతో షాక్‌కు గురైన రింకూ సింగ్ కుటుంబ సభ్యులు.. దాని కోసం పలుచోట్ల వెతికినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
దీంతో రింకూ సింగ్ సోదరి నేహా సింగ్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగభరితమైన వీడియోను పంచుకుంటూ, తమ పెంపుడు జంతువును కనిపెట్టడంలో ప్రజలందరూ సహాయం చేయాలని కోరారు.
వరుసగా నాలుగు రోజుల పాటు గాలించిన తర్వాత, చివరకు ‘బ్రూటో’ సురక్షితంగా మళ్లీ తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుంది. కుక్కను చూడగానే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్న నేహా సింగ్, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరో కొత్త వీడియోను పంచుకున్నారు.

Leave a Reply