స్విట్జర్లాండ్‌లోని అందమైన పర్వత నగరం దావోస్‌లో ప్రతి ఏటా జనవరిలో ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చించడానికి ఇక్కడ సమావేశమవుతారు. అయితే, ఈసారి ఈ సమావేశాల కంటే అక్కడ జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
ఎలైట్ సెక్స్ పార్టీలు మరియు భారీ ఖర్చు దావోస్ సమావేశాల సమయంలో అక్కడికి వచ్చే సంపన్నులు, ప్రముఖులు కేవలం వ్యాపార చర్చలకే పరిమితం కాకుండా ‘ఎలైట్ సెక్స్ పార్టీలు’, ‘ఎస్కాార్ట్ బుకింగ్స్’ కోసం భారీగా డబ్బు ఖర్చు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గతంలో కంటే ఈసారి ఎస్కార్ట్ సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని సమాచారం.
300 మందికి పైగా ఎస్కార్ట్‌లు – కఠినమైన ఒప్పందాలు నివేదికల ప్రకారం, సుమారు 300 మంది మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్ ఎస్కార్ట్‌లను 90 మంది ఖాతాదారుల కోసం బుక్ చేశారు. ఈ సేవల్లో పాల్గొనే మహిళలతో ‘నాని-డిస్క్లోజర్ అగ్రిమెంట్’ (NDA) పై సంతకాలు చేయించుకుంటారు, తద్వారా లోపల ఏం జరిగిందనే విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడతారు.
ఒక్కో బుకింగ్‌కు రూ. 6.5 లక్షలు కొన్ని కేసుల్లో, నాలుగు రోజుల విందు వినోదాల కోసం సుమారు 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకేసారి ఐదుగురు మహిళలను బుక్ చేసుకోవడం వంటి సంఘటనలు కూడా ఉన్నాయి. హోటల్, మద్యం, ప్రయాణ ఖర్చులు కాకుండా కేవలం ఈ సేవలకే ఇంత మొత్తం చెల్లిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఒక్కో మహిళ ఒక బుకింగ్‌కు సుమారు రూ. 6.5 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం.
దావోస్ ప్రతిష్టకు భంగం స్విట్జర్లాండ్‌లో వ్యభిచారం చట్టబద్ధమే అయినప్పటికీ, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక ఆర్థిక వేదికలో ఇలాంటి కార్యకలాపాలు జరగడం చర్చనీయాంశమైంది. ఇది ఆ వేదిక యొక్క నైతికతను మరియు అక్కడ పాల్గొనే నాయకుల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
