4 ఏళ్లయినా కుళ్లిపోలేదు.! అమెరికా టెక్నాలజీ సాయంతో 80 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని భద్రపరిచిన కుటుంబ సభ్యులు.. పోలీసులకే తల తిరిగేలా చేసిన ఘటన.. ఇది ఎలా సాధ్యం.?

ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఒక క్లినిక్‌లో గత నాలుగేళ్లుగా 80 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపరిచిన ఘటన వెలుగులోకి వచ్చి, పోలీసులను సైతం తీవ్ర అయోమయంలోకి నెట్టింది.

గత సోమవారం రాత్రి పోలీసులకు అందిన రహస్య సమాచారం ఆధారంగా, మరమ్మతు పనుల కోసం మూసి ఉంచిన ఒక పాలీక్లినిక్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో, అక్కడ ఉన్న ఒక కూలింగ్ ఫ్రీజర్‌లో 80 ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని భద్రంగా ఉంచడం చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు.

వెంటనే ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులను సంప్రదించి పోలీసులు విచారణ జరిపారు. విచారణలో, 2022వ సంవత్సరంలోనే ఆ వృద్ధుడు మరణించినట్లుగా ఉన్న మెడికల్ సర్టిఫికెట్లను కుటుంబ సభ్యులు సమర్పించారు. తండ్రి మరణంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆయన భార్య, పిల్లలు.. ఆయన మృతదేహాన్ని పాడవకుండా ఎక్కువ కాలం భద్రపరచాలని భావించారు.

దీనికోసం ఇంటర్నెట్‌లో వెతికినప్పుడు, అమెరికాలోని ‘క్రయోనిక్స్’ (Cryonics) సంస్థల గురించి వారికి తెలిసింది. ఈ సాంకేతికత ద్వారా అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని గడ్డకట్టించి ఎన్నో ఏళ్లపాటు భద్రపరచవచ్చని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, వృద్ధుడి మృతదేహాన్ని అమెరికాకు తరలించేందుకే గత నాలుగేళ్లుగా క్లినిక్ ఫ్రీజర్‌లో ఉంచి నిర్వహిస్తున్నారు.

మానవ అవయవాలు, కణాలను భద్రపరిచే సాంకేతికత వాడుకలో ఉన్నప్పటికీ, మనిషి శరీరాన్ని పూర్తిగా ఇలా భద్రపరచడం అనేది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో, ఒకరి మృతదేహాన్ని ఇలా ఏళ్ల తరబడి ఫ్రీజర్‌లో ఉంచి భద్రపరచడం చట్టప్రకారం చెల్లుబాటు అవుతుందా? దీనికి అనుమతి ఉందా? అనే విషయాలపై ముంబై పోలీసులు న్యాయ నిపుణులతో తీవ్రంగా సంప్రదింపులు జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *