-40 మార్కులు వచ్చినా పీజీ మెడికల్‌లో సీటు! ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్రం సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ (NEET PG 2025) సీట్ల ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కౌన్సెలింగ్ తర్వాత కూడా వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోవడంతో, అర్హత మార్కులను (Percentile) భారీగా తగ్గించింది. దీనివల్ల గతంలో అనర్హులుగా ప్రకటించబడిన వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు మూడవ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభించింది.

ప్రధాన మార్పులు:

  • జనరల్ కేటగిరీ: అర్హత మార్కులు 50 పర్సంటైల్ నుండి 7 పర్సంటైల్‌కు తగ్గించబడ్డాయి. కట్-ఆఫ్ స్కోరు 276 నుండి 103కి పడిపోయింది.
  • రిజర్వ్‌డ్ కేటగిరీ (SC/ST/OBC): వీరికి కట్-ఆఫ్ స్కోరును ఏకంగా 0 పర్సంటైల్‌కు తగ్గించారు. అంటే మైనస్ 40 (-40) మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఇప్పుడు పీజీ సీటు పొందేందుకు అర్హులవుతారు.
  • దివ్యాంగులు (UR-PWD): వీరికి కట్-ఆఫ్ 45 నుండి 5 పర్సంటైల్‌కు తగ్గించబడింది (స్కోరు 90).

ఎందుకు ఈ నిర్ణయం?: ఈ ఏడాది సుమారు 2.4 లక్షల మంది పరీక్ష రాయగా, దేశవ్యాప్తంగా 70,000 సీట్లు ఉన్నాయి. రెండో రౌండ్ కౌన్సెలింగ్ ముగిసినా ఇంకా 9,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) విజ్ఞప్తి మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


Posted

in

by

Tags: