“4480 మీటర్ల ఎత్తులో ఆకస్మిక గండి..!” హిమాలయాల్లో మరో విపత్తు.. భూటాన్‌లో పగిలిన హిమానీనద సరస్సు.. పోటెత్తిన వరదలతో భారత్‌లో రెడ్ అలర్ట్..!!

భూటాన్‌లోని ‘షింధాబూ’ అనే హిమానీనద సరస్సు (గ్లేసియర్ లేక్) ఆకస్మికంగా పగిలిపోవడంతో, పోటెత్తిన వరదల కారణంగా భూటాన్‌తో పాటు భారత సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు, నష్టం వాటిల్లింది.

మో చూ (Mo Chhu) నది ఎగువ భాగంలో 4480 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరస్సు పగిలిపోవడంతో, ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి కారణంగా వంతెనలు, రోడ్లు, వేడి నీటి బుగ్గలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

భూటాన్‌లో ఉద్భవించిన ఈ వరద ప్రవాహం, భారత్‌లోని సంకోష్, బ్రహ్మపుత్రా నదుల గుండా ప్రవహిస్తుండటంతో.. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు అధికారులు తక్షణమే రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల నుంచి సుమారు 10,000 మందికి పైగా ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు.

వాతావరణ మార్పుల కారణంగా హిమానీనదాలు (గ్లేసియర్లు) వేగంగా కరుగుతుండటంతో ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, భారత్, భూటాన్ దేశాల మధ్య ఉన్న తక్షణ సమాచార మార్పిడి (అర్లీ వార్నింగ్) వ్యవస్థ కారణంగా పెద్ద ప్రాణనష్టం, పెను ప్రమాదం తప్పింది.


Posted

in

by

Tags: