చెన్నై మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికురాలు (Sweeper)గా పనిచేస్తున్న శ్రీమతి పద్మ, చెన్నై టీ నగర్ రోడ్డుపై పడి ఉన్న 45 సవర్ల (360 గ్రాముల) బంగారు ఆభరణాలను కనుగొన్నారు. వాటిని తన వద్ద ఉంచుకోకుండా వెంటనే తమిళనాడు పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఈ గొప్ప కార్యానికి ముగ్ధుడైన లలితా జ్యువల్లరీ యజమాని డాక్టర్ ఎం. కిరణ్ కుమార్, ఆమెను తన ఇంటికి పిలిచి ఘనంగా సత్కరించారు.
నిజాయితీకి నీరాజనం: పద్మను సత్కరించిన సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. “ఇలాంటి వ్యక్తులే మన సమాజానికి రోల్ మోడల్స్. వారిని గౌరవించుకోవడం మన బాధ్యత” అని కొనియాడారు. తన ప్రశంసలకు గుర్తుగా ఆమెకు ఒక వెండి పళ్లాన్ని బహుమతిగా అందించారు. “ఈ రోజుల్లో, ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి ఇంతటి విలువైన వస్తువులను తిరిగి ఇవ్వాలంటే ఎంతో నిజాయితీ ఉండాలి. ఇంతటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తిని నా ఇంటికి ఆహ్వానించడం నాకు వ్యక్తిగతంగా దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.
