హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రముఖ మద్యం వ్యాపారి శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లో గత ఆగస్టు 31న 10 తులాల బంగారం, వజ్రాలు, పచ్చల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వ్యాపారి భార్య నీలూ కౌర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
- కనుబొమ్మ పైనున్న మచ్చతో దొరికిపోయాడు: ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. దొంగ తన ముఖాన్ని మాస్కుతో పూర్తిగా కప్పుకున్నాడు. అయితే, అతని కనుబొమ్మ పైభాగంలో ఉన్న చిన్న మచ్చను పోలీసులు నిశితంగా గమనించి, పాత నేరస్థుల జాబితాతో సరిపోల్చారు. ఆ నిందితుడు బంజారాహిల్స్లో అద్దెకు ఉంటూ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న పెందుర్తికి చెందిన గౌరేష్ (27) అని గుర్తించారు.
- గోవా క్యాసినోలో ఎంజాయ్: ఆభరణాలను దొంగిలించిన గౌరేష్, వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బుతో ఫ్లైట్ ఎక్కి గోవాకు చెక్కేశాడు. అక్కడ క్యాసినోలో జూదం ఆడుతూ లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నాడు.
- గోవాలోనే పట్టుకున్న పోలీసులు: నిందితుడి కదలికలను సాంకేతిక పరిజ్ఞానంతో పసిగట్టిన హైదరాబాద్ పోలీసులు.. గోవాకు వెళ్లి అక్కడి క్యాసినోలోనే అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతని నుంచి చోరీకి గురైన ఆభరణాలను రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
