ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ సమీపంలోని ఒక ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది.
తన భార్య, ఆమె ప్రియుడు ఒకే ఆటోలో ప్రయాణిస్తుండటాన్ని చూసిన భర్త, ఆగ్రహంతో ఊగిపోతూ ఇద్దరినీ ఆటోలోంచి కిందకు దించి నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ ఆకస్మిక దాడితో ఆ ప్రాంతంలో భారీగా జనం గుమిగూడి ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అందరినీ శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం.. సదరు యువకుడికి 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భర్త గురుగ్రామ్‌లో ఉంటూ కూలీ పని చేసుకుని జీవించేవాడు. పెళ్లి తర్వాత తన భార్యను కూడా గురుగ్రామ్ తీసుకెళ్లాడు.
అక్కడ ఉంటున్న సమయంలో, భార్యకు రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్‌కు చెందిన ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది నెలల క్రితం భార్య తన భర్తను వదిలేసి, ప్రియుడితో వెళ్లిపోయి ‘లివ్-ఇన్’ (సహజీవనం) రిలేషన్‌షిప్‌లో ఉండటం ప్రారంభించింది. భార్య కోసం పలుచోట్ల తీవ్రంగా గాలించిన భర్తకు, వారిద్దరూ ఫిరోజాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న భర్త, ఆటోలో జంటగా వెళ్తున్న వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దాడి చేశాడు.
దాడి చేసిన తర్వాత భార్యను తనతో పాటు ఇంటికి రావాలని భర్త కోరాడు. అయితే, ఆ మహిళ తన భర్తతో వెళ్లేందుకు ససేమిరా నిరాకరించింది. దీనిపై ఆ మహిళ మాట్లాడుతూ.. “నా భర్త తాగుబోతు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి నన్ను దారుణంగా కొడుతూ, చిత్రహింసలు పెట్టేవాడు. తాగుడు కోసం ఇంట్లోని బైక్, వస్తువులను సైతం అమ్మేశాడు. అందుకే అతడిని వదిలేసి వచ్చేశాను” అని బహిరంగంగా ఆరోపించింది.
ప్రస్తుతం పోలీసులు ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, ఇరువర్గాల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పిలిపించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో చర్చలు జరిపి, దాని ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Leave a Reply