పెరుగుతున్న వయసు ప్రభావం మొదట ముఖంపైనే కనిపిస్తుంది. చర్మంపై ముడతలు రావడం, చర్మం సాగిపోవడం వంటి లక్షణాలు కనిపించగానే చాలామంది బోటాక్స్ వంటి ఖరీదైన ట్రీట్‌మెంట్లు చేయించుకుంటారు. అయితే, ఈ సమస్యలకు మీ వద్దే పరిష్కారం ఉంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ చెవులను మసాజ్ చేసుకోవడం ద్వారా సహజంగా యవ్వనాన్ని పొందవచ్చు.
చెవి మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు:
- లింఫ్ కణాల శుద్ధి: మన చెవుల దగ్గర ప్రధాన లింఫ్ కణాలు ఉంటాయి. వీటిని మసాజ్ చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లి ముఖం బిగుతుగా, అందంగా మారుతుంది.
- బ్లడ్ సర్క్యులేషన్: చెవుల వద్ద ఉండే ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉత్తేజితమై, ముఖానికి రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ అందుతాయి. దీనివల్ల ముఖం సహజంగా మెరుస్తుంది.
- ఒత్తిడి తగ్గింపు: దవడ కండరాలు (Jaw muscles) సడలి, ముఖంపై అలసట తగ్గుతుంది.
మసాజ్ ఎలా చేయాలి? (6 పద్ధతులు):
- సైడ్ పుల్: చెవి పైభాగాన్ని పట్టుకుని పైకి 10 సార్లు లాగండి.
- సైడ్ వే పుల్: చెవి మధ్య భాగాన్ని పట్టుకుని బయటకు 10 సార్లు లాగండి.
- పుల్ డౌన్: చెవి కింద భాగాన్ని (Lobes) మెల్లగా కిందకు 10 సార్లు లాగండి.
- సర్క్యులర్ మోషన్: చూపుడు వేలు, బొటనవేలితో చెవిని గడియారం ముల్లు తిరిగే దిశలో (Clockwise) మరియు వ్యతిరేక దిశలో 10 సార్లు తిప్పండి.
- అప్పర్ సర్విక్స్ మసాజ్: చెవి పై మడత దగ్గర బొటనవేలితో తల వైపు తేలికగా ఒత్తిడి ఇస్తూ మసాజ్ చేయండి.
- ఇయర్ పించ్: చెవిని నిలువుగా మెల్లగా నొక్కుతూ వదలండి.
