51 మంది ఆటగాళ్లకు బిసిసిఐ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్; విరాట్, రోహిత్‌లకు భారీ షాక్!

Sports Desk, New Delhi: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025-26 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. ఇందులో వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

బీసీసీఐ ఈసారి A+ కేటగిరీని పూర్తిగా రద్దు చేసింది. గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మరియు రవీంద్ర జడేజా ఈ కేటగిరీలో ఉండేవారు. తాజా ఒప్పందంలో రోహిత్-విరాట్‌లను ఏ+ నుండి B కేటగిరీకి తగ్గించారు.

కొత్త కాంట్రాక్టులో బిసిసిఐ ‘A’ కేటగిరీతో ప్రారంభించింది. ఇందులో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా మరియు రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది. బి కేటగిరీలోకి మారడం వల్ల విరాట్, రోహిత్‌లకు ఆర్థికంగా పెద్ద నష్టం జరగనుంది. వీరికి ఇకపై వార్షికంగా ₹4 కోట్ల ఆదాయం తగ్గనుంది. అలాగే మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులను కూడా ప్రకటించారు.


రోహిత్-విరాట్ ‘డిమోషన్’ (ప్రమోషన్ కు వ్యతిరేకం)

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఈ కాంట్రాక్టులో హోదా తగ్గింది. గతంలో వీరు ఏ+ కేటగిరీలో ఉండి ఏడాదికి ₹7 కోట్లు అందుకునేవారు. ఇప్పుడు బి కేటగిరీలో ఉండటం వల్ల వీరికి బిసిసిఐ నుండి ఏడాదికి ₹3 కోట్లు మాత్రమే లభిస్తాయి. వీరు ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితం కావడమే ఈ నష్టానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.


పురుషుల జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ వివరాలు
  • కేటగిరీ A: శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
  • కేటగిరీ B: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, కెఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్.
  • కేటగిరీ C: అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజూ శామ్సన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్.

మహిళల జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ వివరాలు
  • కేటగిరీ A: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ.
  • కేటగిరీ B: రేణుకా ఠాకూర్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ రాణా.
  • కేటగిరీ C: రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, ప్రతికా రావల్, క్రాంతి గౌడ్, ఉమా ఛేత్రి, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, జి కమలిని, వైష్ణవి శర్మ, తేజల్ హసబిన్స్.

Posted

in

by

Tags: