6.5 కిలోల బంగారం.. 380 క్యారెట్ల వజ్రాలు.! పూలను పక్కనపెట్టిన దుబాయ్ బంగారు రంగోలి. ప్రారంభించిన నటి తమన్నా.! దీని విలువ ఎన్నో కోట్లో తెలుసా.?

దీపావళి అంటేనే ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, రంగోలీలు వేయడం ఆనవాయితీ. కానీ, దుబాయ్‌లో వీటన్నింటికీ ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా బంగారం, వజ్రాలతో ఒక భారీ రంగోలీని రూపొందించారు.

విభిన్నంగా ఉన్న ఈ కళాఖండం ప్రస్తుతం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

దుబాయ్‌లోని సిటీ సెంటర్ డేరా (Deira) షాపింగ్ మాల్‌లో ఉన్న ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో, దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ రంగోలీని తయారు చేశారు. సుమారు 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉన్న ఈ రంగోలీలో 6.5 కిలోల బంగారం, 380 క్యారెట్లకు పైగా వజ్రాలను ఉపయోగించారు.

ఈ రంగోలీని రూపొందించడానికి నెక్లెస్‌లు, గాజులు, కమ్మలు, ఉంగరాలు సహా మొత్తం 213 రకాల ఖరీదైన ఆభరణాలను ఉపయోగించారు. 10 మంది కళాకారులు సుమారు 16 గంటల పాటు శ్రమించి ఈ భారీ కళాఖండాన్ని చేతులతో తీర్చిదిద్దారు. పూలు, రంగుల పొడులకు బదులుగా ఖరీదైన ఆభరణాలతో దీనిని రూపొందించడం దీని ప్రత్యేకత.

నవంబర్ 6న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ భారతీయ నటి తమన్నా భాటియా పాల్గొని ఈ బంగారు రంగోలీని ప్రారంభించారు. బంగారం, వజ్రాలతో మెరిసిపోతున్న ఈ కళాఖండాన్ని చూసేందుకు స్థానికులు, పర్యాటకులు ఆసక్తిగా అక్కడికి తరలివస్తున్నారు. ఒక సాధారణ రంగోలీని ఇంత అద్భుతంగా మార్చగలరా అని ఈ సృష్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *